ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

నల్లగొండ జిల్లా: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.

హరేందర్‌ కుమార్‌ అనే ప్రైవేట్ ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని,ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నారు.

Petition In High Court Challenging The Free Bus Scheme, Petition ,High Court , F

ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో,అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవు తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి,ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు.

కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచార సమయం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Latest Nalgonda News