మీ అదృష్ట సంఖ్య 5 అయితే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?       2018-06-08   00:35:12  IST  Raghu V

5 వ తారీఖున జన్మించిన వారి లక్షణాలు,గుణగణాలు,ప్రవర్తన ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. 5 నెంబర్ కి అధిపతి బుధుడు. అందువల్ల వీరి మీద బుధుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి. వీరు ఎంత కష్టమైన పనిని అయినా వీరి తెలివితేటలతో సాధిస్తారు. వీరిలో ఈ నేర్పు అధికంగా ఉంటుంది. అలాగే వీరికి ఏ సమస్య వచ్చిన చాలా చాకచక్యంతో బయట పడతారు. ముఖ్యంగా వీరికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు,పలుకుబడి ఉంటాయి.

వీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే వీరికి పరిచయాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో వీరికి జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరో ఒకరు సాయం చేస్తారు. వీరికి నిగ్రహం ఎక్కువ. వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గొడవ పడకుండా స్నేహపూర్వహంగా వ్యవహరించి సమస్యను పరిష్కారం చేసుకుంటారు.

వీరు ఎప్పుడు నవ్వుతు ఉంటూ అందరిని ఆకట్టుకుంటారు. వీరు గౌరవం ఇచ్చి పుచ్చుకొనే రకం. వీరికి అధిపతిగా బుధుడు ఉండటం వలన విజయాల శాతం అధికంగా ఉంటుంది. వీరు ఏ పనిని అయినా బుద్ధిబలంతో సాధించి ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరు అనేక మందికి దిశా నిర్దేశం చేయగల నేర్పు ఉండటం వీరి స్పెషాలిటీ.

వీరికి ఉద్యోగం అయినా వ్యాపారం అయినా రొటీన్ గా ఎప్పుడు ఒకే విధంగా ఉండటం నచ్చదు. అందువల్ల తరచుగా ఉద్యోగాలు,వ్యాపారాలు మార్చేస్తూ ఉంటారు. ఏ వ్యాపారం అయినా వారి తెలివితేటలతో రాణిస్తారు. వీరు చేసే ప్రతి పనిలోకి కొత్తదనాన్ని కోరుకుంటారు.