వానరాల బెదడతో ఇబ్బంది పడుతున్న నరులు...!

నల్లగొండ జిల్లా:మర్రిగూడ మండలం( Marriguda )లో కోతుల బెడదతో ప్రజలు భయాందోళనలకు గురవతున్నారు.

గత కొన్ని రోజుల క్రితం యరగండ్లపల్లి గ్రామానికి చెందిన గట్ల వెంకటేశ్వర్లు, సుజాత దంపతులు తమ కుమార్తె ధరణి(9)తో రాత్రి మేడపై నిద్రిస్తున్న సమయంలో తెల్లవారు జామున మేడపైకి రెండు కోతులు వచ్చి ధరణిపై దాడి చేయడంతో ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి.

తేరుకున్న తల్లిదండ్రులు కోతులను తరిమేశారు.అనంతరం మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో( Government hospital ) చికిత్స అందించారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో కోతులు అధిక సంఖ్యలో సంచరిస్తూ పిల్లలు, వృద్ధులపై దాడులకు పాల్పడుతున్నాయి.గ్రామాలో ప్రజలు వారి ఇంటి తలుపులు మూసి వేసుకొని ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

అటవీశాఖ అధికారులు( Forest officials ) స్పందించి కోతుల( Monkeys ) బెదడ నివారించేందుకు చర్యలు తీసుకొని,హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతాల్లో సీతాఫలం,నేరేడు,రేగు, మారేడు,వెలగ వంటి వివిధ రకాల పండ్ల మొక్కలను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పెంచి కోతులను అడవులకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు.కోతులు పట్టే వారిని ప్రోత్సహించి, వారికి ఉపాధి కల్పిస్తే గ్రామాలలో కోతుల బెదడ ఉండదని,కోతుల వల్లవరిచేను,మామిడి,బత్తాయి వివిధ రకాల పండ్ల తోటలకు కూడా తీవ్రనష్టం కలిగిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
వీడియో వైరల్‌ : మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన టీమిండియా క్రికెటర్‌

Latest Nalgonda News