నల్లగొండ జిల్లా: కల్తీపాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని,మానవుడికే కాదు పశుపక్ష్యాదుల ఆరోగ్యానికి సంకటంగా మారుతున్న కల్తీని నిరోధించేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలించడంలేదనీ సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,బాధితుల బంధువు,ప్రజానేస్తం అవార్డు గ్రహీత కామ్రేడ్ జైబోరన్న గారి సుభాష్ చంద్రబోస్ రాజ నేతాజీ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో రాను రాను కల్తీ పెరుగుతున్నది.
తాగేనీటిలో కల్తీ, పప్పులో కల్తీ, చివరకు ప్రాణాపాయం నుండి కాపాడే మందుల్లో కల్తీ అన్నింటికి మించి పౌష్టికాహారంగా వయసుతో ప్రమేయం లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు సేవించే పాలల్లో కల్తీ,ఇది అది అనితేడా లేకుండా మొత్తం కల్తీమయంగా మారిపోతున్నదని ఆరోపించారు.అన్నింటికంటే ముఖ్యంగా పాలల్లో కల్తీ రానురాను ప్రమాదకరంగా మారుతున్నదని,మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేసే సూచనలు కన్పిస్తున్నాయని,ఇంత ప్రమాదకరంగా మారుతున్నా పొగమంచులా అంతటా విస్తరిస్తున్నా అడిగేవారు, అడ్డగించేవారు కరవైపోతున్నారని బాధపడ్డారు.
ఒకరకంగా చెప్పాలంటే అవినీతికి, కల్తీకి అవినాభావ సంబంధం ఉందని, పెరుగుతున్న అవినీతికి రెట్టింపుస్థాయిలో కల్తీ జరుగుతున్నదని పేర్కొన్నారు.కల్తీ దందాని అరికట్టేందుకు చట్టాలు ఉన్నాయని,ఆ చట్టాలు అమలుచేసి కల్తీ జరిగ కుండా నిరోధించేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని,కానీ, ఆశించిన ఫలితాలు కన్పించడం లేదన్నారు.
ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కల్తీ మానవ జీవనానికి సవాల్గా మారుతున్నా భారత్ లో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదేదో మూడోకంటికి తెలియకుండా జరగ డంలేదని,బహిరంగ వ్యాపారమేనని,పాలల్లోనే కాదు పాల ద్వారా తయారయ్యే నెయ్యి, ఇతర తీపి పదార్థాలు, బట్టర్ లాంటివి కూడా కల్తీమయం అయిపోతున్నాయని అన్నారు.
మొన్న హైదరాబాద్ కేజీల కొద్దీ కల్తీనెయ్యి పట్టుబడిందని, కొందరిని అరెస్టు చేశారని, వారు ఎంతోకాలంగా పాల ఉత్పత్తులను కల్తీ చేస్తూ అమ్ముకుంటున్న విషయం దర్యాప్తులో బయటపడిందని గుర్తు చేశారు.ఇక ఉత్తర భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పాలల్లో కల్తీ ప్రమాదకరస్థాయికి చేరుకుందని చెప్పొచ్చన్నారు.
భారతదేశానికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో సర్వోన్నత న్యాయస్థానం కల్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.దేశప్రజలకు విక్రయించే పాలల్లో అరవైశాతంపైగా కల్తీవేనన్న వాస్తవాన్ని సాక్షాత్తు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల మండలి ఏనాడో వెల్లడించిందని,ఈ దురాఘాతాలను నివారించడంలో విఫలమవుతున్న అధికారగణంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు.
యేడాది యేడాదికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వినియోగం అంతకంతకు పెరుగుతుంటే ఉత్పత్తులు ఆ స్థాయిలో జరగడంలేదని,ప్రస్తుత లెక్కల ప్రకారం చూసినా దేశవ్యాప్తంగా ముప్ఫైశాతం పైగా లోటు కన్పిస్తున్నట్లు అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయని తెలిపారు.వర్షాకాలంలో కొంత ఉత్పత్తి పెరిగినా ఎండాకాలం వచ్చేసరికి గణనీయంగా పడిపోతున్నదని,ఉత్పత్తికి,వినియోగానికి ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు పెద్దఎత్తున కల్తీకి పాల్పడుతున్నారని, బీహార్,ఒడిశా,ఉత్తరప్రదేశ్,జార్ఖండ్ రాష్ట్రాల్లో తనిఖీలు చేస్తే పాలల్లో భారీ ఎత్తున కల్తీ బయటపడిందన్నారు.
ఇక గ్రామాల నుంచి నగరాలకు వచ్చే పాలఅమ్మకందార్లు ఎక్కడపడితే అక్కడ ఏ నీళ్లంటే ఆ నీళ్లను పాలల్లో కలుపుతున్నారని,ఫ్లోరైడ్ తదితర రసాయనికాలు ఉన్న నీళ్లను కలపడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని నిరంతరం నిరుపేదల హక్కుల కోసం పరితపించే వర్గ పోరాట వాది, కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ జేఎస్ఆర్ తెలిపారు.పాల ఉత్పత్తులను పెంచేందుకు పాలకులు ప్రవేశపెడుతున్న పథకాలు అంతగా సఫలీకృతం కావడంలేదని,గతంలో కూడా భారీ ఎత్తున చిన్న సన్నకారు రైతులకు సమృద్ధిగా పాలు ఇచ్చే సంకరజాతి ఆవులను, గేదెలను సరఫరా చేశారని,అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో గిట్టుబాటుకాక ఎనభై శాతం మంది రైతులు పాడిపశువులను అమ్ముకున్నారని అన్నారు.
గ్రామాల్లో పాలఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని,ఫలితంగా గ్రామాల నుంచికాకుండా పట్టణాల నుంచి నగరాల నుంచి గ్రామాలకు పాలు సరఫరా అయ్యే దురదృష్టపు పరిస్థితులు దాపురించాయని అభిప్రాయపడ్డారు.వ్యవసాయ అనుబంధ రాబడి పెంచితే తప్ప కోట్లాది గ్రామీణ పేద ప్రజలపరిస్థితి మెరుగుపడదని జనహితం కోరుకునే అభ్యుదయ వాది జెఎస్ఆర్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాసిన లేఖలో వక్కాణించారు.
పాల ఉత్పత్తి అందుకు ఒక మార్గం.కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయని,చిన్న సన్నకారు రైతుల్లో అధికశాతం పాల ఉత్పత్తికి మంగళం పాడారనే చెప్పొచ్చు.
మధ్యతరగతి, పెద్ద రైతులు కూడా పాడిపరిశ్రమ పట్ల పెద్దగా శ్రద్ధచూపడం లేదని, గతంలో ఎన్నో భూములు విస్తారంగా ఖాళీగా ఉండేవని,అటు ప్రభుత్వ భూములు,ఇటు పెద్దల బీడుభూములు.ఎన్నోపశువులు మేపుకోవడానికి ఉపయోగించుకునేవారని, భూముల డిమాండ్ పెరగడంతో ఎక్కడికక్కడ భూముల చుట్టూ పటిష్టమైన కంచెలు ఎవరికివారు వేసుకున్నారన్నారు.
దీంతో పశువులు మేయడానికి భూములు లేకుండాపోయాయని,భూములు లేనివారు పశువులను పెంచుకునే అవకాశాలు తగ్గిపోయాయని,పెద్ద రైతులేమో ఆవైపు దృష్టిపెట్టడం లేదని, గ్రామీణ వాస్తవ పరిస్థితులను రైతుబిడ్డ, కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ వివరించారు.వ్యవసాయ రంగంలో కూలీల సమస్య తీవ్రరూపం దాల్చడంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని, దీంతో గ్రామాల్లో పాడిపరిశ్రమ పతనం అంచునకు చేరిందని చెప్పారు.
ఇక ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న పెద్ద పెద్ద డయిరీల్లో అధికశాతం నష్టాల ఊబిలో కూరుకుపోయని, కొన్నిమూతపడినా,మరికొన్ని అదే బాటలో పయనిస్తున్నాయని, ప్రభుత్వాల నుండి ప్రోత్సాహకాలు అంతంతమాత్రంగానే ఉండడంతో అసలు పాడిపరిశ్రమ మనుగడ సాగించగలదా అనే అనుమానాలనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో కామ్రేడ్ జే ఎస్ ఆర్ వ్యక్తపరిచారు.ఇప్పటికైనా పాలకులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి పాడిపరిశ్రమను ప్రోత్సహించకపోతే రాబోయే రోజుల్లో స్వచ్ఛమైన పాలు దొరకడం ప్రశ్నార్థకమే అవుతుందని బాధితుల బంధువు,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
Latest Nalgonda News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy