పెన్నా సిమెంట్ ప్రజాభిప్రాయ సేకరణ ఆపాలి:సామాజిక కార్యకర్త బెల్లంకొండ శేఖర్

సూర్యాపేట జిల్లా: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం గణేష్ పహాడ్ గ్రామ పరిధిలో 303.664 హెక్టార్లలో పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (చాణిక్య సిమెంట్) పరిశ్రమ ఉందని, దానికి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యంపహాడ్ గ్రామ పరిధిలో ఉన్న 50.

572 హెక్టార్లో సున్నపురాయి గని ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుటకు చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను నిలిపివేయాలని సామాజిక కార్యకర్త, సమాచార హక్కు సంరక్షణ చట్టం -2005 జాతీయ అధ్యక్షుడు బెల్లంకొండ శేఖర్ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో సదరు పరిశ్రమ వారు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేశారన్నారు.2024 నవంబర్ 12 మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటలకు శూన్యంపహాడ్ గ్రామంలో 50 హెక్టార్లలో సున్నపురాయి విస్తీర్ణం కొరకు పబ్లిక్ హియరింగ్ చేపట్టనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి నల్గొండ జిల్లా కార్యాలయం నోటీస్ బోర్డు యందు తెలిపి,ఆ ప్రకటనను వి6 వెలుగు పత్రికలో 2024 అక్టోబర్ 11 న ప్రచురణ జరిగే విధంగా యాడ్ ఇచ్చినట్లు చూపించారని,కానీ,2024 అక్టోబర్ 11రోజున వెలుగు దినపత్రికలో ప్రచురించలేదన్నారు.ప్రజాభిప్రాయ సేకరణ విషయం శూన్యంపహాడ్ గ్రామ మరయు పాలకవీడు మండల ప్రజలకు తెలియకుండా ఉండేందుకే పరిశ్రమ యాజమాన్యం కావాలనే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు.12.11.2024 న పెన్నా సిమెంట్ పరిశ్రమ చేపట్టనున్న పబ్లిక్ హియరింగ్ నిలుపుదల చేస్తూ జిల్లా ప్రజలు,స్థానికులకు, అధికారులకు తెలిసేలా మరో ప్రకటన జారీ చేసిన తర్వాతే పబ్లిక్ హియరింగ్ ను నిర్వహించాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఇదిలా ఉంటే నల్లగొండ జిల్లాలో ఉన్న పెన్నా సిమెంట్ వల్ల మొదటి నుండి సూర్యాపేట జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,అయినా బాధిత గ్రామాలకు పరిశ్రమ నుండి ఎలాంటి డెవలప్మెంట్ నిధులు కేటాయించక పోవడంపై బాధిత ప్రజలు మండిపడుతున్నారు.

Latest Suryapet News