పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్( Pawan Kalyan, Sai Dharam Tej ) కాంబినేషన్ లో తాజాగా తెరకెక్కిన చిత్రం చిత్రం బ్రో.సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదల హిట్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్( Trivikram ) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
కాగా ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా ఎన్నో అంచనాలను ఏర్పరచుకుని విడుదలైంది.
అందుకు తగ్గట్లుగానే వీకెండ్‌లో సత్తా చాటిన ఈ మూవీ సోమవారం భారీగా స్పందనను కోల్పోయింది.ఈ క్రమంలోనే మంగళవారం కూడా మరింత డౌన్ అయింది.నైజాంలో రూ.30 కోట్లు, సీడెడ్‌లో రూ.13.20 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ.37.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది.ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ.80.50 కోట్ల బిజినెస్ చేసుకుంది.అలాగే, కర్నా ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.12 కోట్లతో కలిపి.ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.97.50 కోట్లు బిజినెస్ చేసింది.5వ రోజుకూడా ఇంతే.
ఈ మూవీ 5వ రోజైన మంగళవారం వసూళ్లు మరింతగా డౌన్ అయ్యాయి.దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కేవలం రూ.1.60, 1.70 కోట్లు షేర్ మాత్రమే వసూలు చేసింది.వరల్డ్ వైడ్‌గా రూ.1.90, 2.00 కోట్లు షేర్‌ను రాబట్టినట్లు తెలిసింది.ఇలా ఐదు రోజుల్లో ఈ సినిమా రూ.61 కోట్లు వరకూ వసూలు చేసింది.కాగా భారీ అంచనాల నడుమ విడుదలైన బ్రో సినిమా( Bro movie ) ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
కొందరు ఈ సినిమాపై విమర్శలు గుప్పిస్తుండగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రమే సినిమా బాగుంది సూపర్ హిట్ అని అంటున్నారు.