సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు.. షాకింగ్ విషయాలు చెప్పిన పవన్ ?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయిధరమ్ తేజ్ కొన్నిరోజుల క్రితం రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే.అయితే ఆ తర్వాత సాయితేజ్ కళ్లు తెరిచారని మరికొన్ని రోజుల్లో సాయితేజ్ డిశ్చార్జ్ అవుతారనే ప్రచారంలోకి వచ్చాయి.

 Pawan Kalyan Shocking Comments About Hero Saitej Health , Interesting Facts, Paw-TeluguStop.com

తాజాగా పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కాగా తేజ్ యాక్సిడెంట్ గురించి స్పందించారు.తేజ్ నిర్లక్ష్యంగా నడుపుతున్నాడని కథనాలు వచ్చాయని పవన్ తెలిపారు.

ఇసుక వల్ల తేజ్ పడిపోయాడని మనం జాలిపడాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.మేమూ మనుషులమే అని ప్రమాదాలు అందరికీ జరుగుతాయని మాపై కనికరం చూపించండని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

దేవా కట్టా డైరెక్షన్ లో వచ్చిన ప్రస్థానం చూశానని రిపబ్లిక్ సామాజిక స్పృహతో తీసిన సినిమా అని పవన్ చెప్పుకొచ్చారు.సాయితేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని కళ్లు తెరవలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.

సాయితేజ్ ఆస్పత్రిలో ఉండటం వల్లే తేజ్ కు, ప్రొడ్యూసర్స్ కు విషెస్ చెప్పడానికి తాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.సినిమా వాళ్లు దొమ్మీలు, దోపిడీలు చేసి డబ్బులు సంపాదించడం లేదని ప్రభాస్, రానా కండలు పెంచి కష్టపడితే బాహుబలి వచ్చిందని, ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్పులు బాగా వేస్తుంటే, చరణ్ గుర్రపు స్వారీలు చేస్తుంటే డబ్బులు ఇస్తున్నారని ఊరికే డబ్బులు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Telugu Pawan Kalyan, Saitej-Movie

సినిమా హీరోలు తీసుకున్న మొత్తంలో ఎక్కువ మొత్తం ట్యాక్స్ రూపంలో పోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ఒళ్లు హూనం చేసుకుంటే మాత్రమే సినిమా వాళ్లకు డబ్బులు వస్తున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.పవన్ కామెంట్లకు వైసీపీ నేతల నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube