ప‌వ‌న్ డ‌బుల్ గేమ్‌.. త‌ల‌ప‌ట్టుకుంటున్న‌ జ‌న‌సైనికులు..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని దివీస్ ప‌రిశ్ర‌మ బాధిత రైతాంగాన్ని క‌లిశారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, వైసీపీ నేత‌ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు తాగే నీళ్లు కాలుష్యమైతే బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఈ భూమి వారసత్వంగా వచ్చింది.ఈ భూమంతా జగన్ వైసీపీ నేతల సొంతామా? పారిశ్రామికీకరణ కోరుకునే వ్యక్తిని  ప్రభుత్వ విధానాలు సరిగా లేకపోతే నిలదీస్తాం కాలుష్య జలాలను వదిలేస్తాం సముద్రంలోకి కలిపేస్తామంటే కదరదు అని ప్ర‌భుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.దీంతో ఇక్క‌డి ప్ర‌జ‌లు ఒకింత ఉప‌శ‌మ‌నం పొందినా.

 Pawan Kalyan Playing Doube Game New Headache For Janasainiks,ap,political News,l-TeluguStop.com

జ‌న‌సేన పార్టీలో మాత్రం క‌ల‌క‌లం రేగింది.ఎందుకంటే ఈ జిల్లాకు ప‌క్క‌నే ఆనుకుని ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రిలోని తుందుర్రులో ఆక్వా ఫ్యాక్ట‌రీ ఉంది.

Telugu Janasainks, Janasena, Latest, Headache, Pawan Kalyan, War, Tirupathi-Telu

ఈ ఆక్వా ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డ నుంచి త‌ర‌లించాల‌ని దీనివ‌ల్ల ప‌చ్చ‌టి త‌మ పంట‌లు నాశ‌నం అవుతున్నాయ‌ని.రైతులు తీవ్ర‌స్థా యిలో ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.ఇప్ప‌టికే గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారు.కేసులు ఉన్నా యి.గ‌తంలోనే ఈ స‌మ‌స్య‌ను వారు ప‌వ‌న్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ప‌వ‌న్ ఈ విష‌యంలో ఎక్క‌డా స్పందించ‌లేదు.

నిజానికి ఈ స‌మ‌స్య ఇప్ప‌టికీ ర‌గులుతూనే ఉంది అయినా ప‌ట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వ‌న్‌పై ఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.

Telugu Janasainks, Janasena, Latest, Headache, Pawan Kalyan, War, Tirupathi-Telu

ఇక‌, ఈ విష‌యం గ‌తంలో కూడా రాజ‌కీయ దుమారం రేపింది.ఈ స‌మ‌యం లో మౌనంగా ఉన్న ప‌వ‌న్‌ ఇప్పుడు దివీస్ విష‌యంలో జోక్యం చేసుకోవ‌డం త‌ప్పుకాక‌పోయినా గ‌త స‌మ‌స్య‌నుఎందుకు తొక్కి పెడుతున్నారు? అనేది జ‌న‌సేన‌లోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.రాజ‌కీయాల్లో నాయ‌కులు ఎప్పుడు ఎలాగైనా మారొచ్చు ఎవ‌రి సిద్ధాంతాలు వారికి ఉంటాయి.

అయితే వీట‌న్నింటికీ భిన్నంగా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌శ్నిస్తానంటూ రాజ‌కీయ పార్టీ పెట్టిన‌ప‌వ‌న్‌ వాటిలోనే భిన్న‌మైన ధోర‌ణులు పాటిస్తుండ‌డం.త‌న‌కు న‌చ్చిన‌ట్టు తాను మెచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంపై జ‌న‌సేన‌లోనే చిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది.

తుందుర్రు ఆక్వా ప‌రిశ్ర‌మ విష‌యా న్ని కూడా ఇలానే రాజ‌కీయంగా ప‌వ‌న్ ఎదుర్కొని ఉంటే ఓ రేంజ్‌లో ఆయ‌న‌కు గుర్తింపు ఉండేది.కానీ, అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మౌనంగా ఉండి ఇప్పుడు మాత్ర‌మే దివీస్ గుర్తుకు వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది.

నేడు మారిన సాంకేతిక‌త నేప‌థ్యంలో ప్ర‌జ‌లు దేనినీ మ‌రిచిపోవ‌డం లేదు.ఈ క్ర‌మంలో పవ‌న్ వ్య‌వ‌హారాన్ని కూడా నిశితంగానే గ‌మ‌నిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన‌లో నే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube