హీరోలకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఉంటారు.హీరోల స్టార్డమ్, సినిమాలు, నటనను బట్టి ఫ్యాన్స్ అవుతారు.
కొంతమంది హీరోలకు పెద్ద సంఖ్యలో పాపులారిటీ ఉంటుంది.కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ఉంటారు.
కొంతమంది తమ హీరోలపై ఉన్న అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తూ ఉంటారు.కొంతమంది తొలిరోజే బెనిఫిట్ షో సినిమా చూసి ఎంజాయ్ చేస్తే.
మరికొంతమంది పదులసార్లు సినిమా చూస్తారు.ఇక మరికొంతమంది తమ అభిమాన హీరో పేరుతో సేవా కార్యక్రమాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.
అలాగే కొంతమంది తమ పెళ్లి కార్డుల్లో( Wedding Card ) అభిమాన హీరో ఫొటోలు ప్రింట్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.తాజాగా అలాంటి ఒక పెళ్లి కార్డు సోషల్ మీడియలో వైరల్ గా మారింది.ఏపీలోకి చెందిన ఒక వ్యక్తి పెళ్లి కార్డును రాజకీయంగా కూడా ఉపయోగించుకున్నాడు.తన అభిమాన నాయకుడైన జనసేన అధినేతన పవన్ కళ్యాణ్ కు( Pawan Kalyan ) ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాడు.
మార్పునకు ఆహ్వానం అంటూ పెళ్లి కార్డులో పొందుపర్చాడు.తిరుపతికి చెందిన సనకా కైలాసవతి అనే వ్యక్తి తన కుమారుడు వెంకట నాగ అనిల్ కుమార్ వివాహాన్ని సెప్టెంబర్ 2న అత్యంత ఘనంగా నిర్వహించాడు.
పవన్ కు అనిల్ వీరాభిమాని కావడంతో పెళ్లి కార్డులో వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు.
ఒక్కసారి జననాయకుడు జనసేనాని పవన్ కళ్యాన్ కు అవకాశం ఇద్దాం.గాజు గుర్తుకు ఓటేద్దాం.రాష్ట్ర భవిష్యత్తులను కాపాడుకుందాం అంటూ వెడ్డింగ్ కార్డులో పేర్కొన్నాడు.
జనసేన పార్టీని( Janasena Party ) గెలిపించాలని కోరాడు.ఈ పెళ్లి కార్డు నెట్టింట వైరల్ గా మారడంతో.
ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైనట్లు కనిపిస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.అలాగే దీనిపై అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు.
గతంలోనూ ఇలా పవన్ అభిమానులు తమ పెళ్లికార్డులపై పవన్ కళ్యాణ్ ఫొటోలను ప్రింట్ చేయించుకున్నారు.