Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ కులగోత్రాలు.. పవన్ కు ఫ్యాన్స్ కాదు భక్తులు ఉంటారంటూ?

నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పుట్టినరోజు అన్న విషయం మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ పుట్టినరోజు( Pawan Kalyan Birthday ) సందర్భంగా అభిమానులు వారం రోజుల ముందు నుంచే ఘనంగా ఏర్పాటు చేస్తూనే ఉన్నారు.

 Pawan Kalyan Birthday Celebrations-TeluguStop.com

పెద్ద ఎత్తున రక్త దానాలు, సామాజిక సేవలు చేయడంతో పాటు భారీగా కటౌట్లను ఏర్పాటు చేసి పూల దండలు వేయడం పాలాభిషేకలు చేయడం లాంటివి చేస్తున్నారు.అలాగే పవన్ పుట్టినరోజు సందర్భంగా మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ సినిమా( Gudumba Shankar ) రిలీజ్ చేయడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

ఆ సంగతి పక్కన పెడితే అందరూ హీరోలకు అభిమానులు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు( Pawan Fans ) వేరయా అని చెప్పవచ్చు.ఎందుకంటే తాజాగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కులగోత్ర నామాలను ట్రెండ్ చేస్తున్నారు.వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది నిజం.పవన్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ నేపథ్యంలోనే కొంతమంది ఫ్యాన్స్ ఆయన గోత్రా నామాలను షేర్ చేసి రేపు పవన్ బర్త్ డే గుడికి వెళ్లి( Templa ) పూజ చేయించాలనుకున్నవారు ఈ గోత్రనామాలతో పూజ చేయించండి అని రాసుకొచ్చారు.

పేరు కొణిదెల కళ్యాణ్ బాబు,( Konidela Kalyan Babu ) జనకుల గోత్రం,( Janakula Gothram ) మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం అని చెప్పుకొస్తున్నారు.51 ఏళ్ళు పూర్తిచేసుకున్న పవన్ రేపు 52వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ఈ రేంజ్ లో పూజలు, హోమాలు చేయించడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.ఇదేందయ్యా ఇది.కుల గోత్రాలు ట్రెండింగ్ ఏంటయ్యా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న పనులను విమర్శిస్తుండగా మరికొందరు మాత్రం మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube