కాంగ్రెస్ కు పాల్వాయి స్రవంతి షాక్

నల్లగొండ జిల్లా: గత ఉప ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి ఈ ఎన్నికల్లో హ్యాండ్ ఇవ్వడంతో ఆమె అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే.

దీనితో ఆమె పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లడుతూ కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.నేడు కాంగ్రేస్ పార్టీ సిద్ధాంతాలతో కాదు, కేవలం డబ్బుతో నడుస్తుందన్నారు.

తనలాంటి ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, టిక్కెట్ ఖరారు చేయడంలో వేలం పాట పెడుతున్నారు.పార్టీ ఫిరాయింపుదారులతో కాంగ్రేస్ పార్టీ నడుస్తుందని ఘాటుగా విమర్శించారు.

ఈ రోజు ఏం మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ దని అనడంతో కాంగ్రేస్ పార్టీలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు.

Advertisement

ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీ కోసం నా వంతుగా కృషి చేశానని,కానీ,నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీని విడాల్సి వస్తుందని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.ఒక బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని,తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ నుండి బయటికి వెళ్లాల్సి వస్తుందన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చిన్నచిన్న లోపాలున్నా ప్రజలకు దగ్గరగా ఉందని చెప్పారు.దీనితో ఆమె త్వరలోనే బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Latest Nalgonda News