పాకిస్తాన్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే.అక్కడ ప్రజల జీవన విధానం రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది.
ఈ క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న గోధుమపిండి రేషన్ కోసం ప్రజలు కొట్టుకుంటున్న వీడియోలు కూడా ఇటీవల వైరల్ కావడం జరిగింది.
పాకిస్తాన్ లో విదేశీ మారక నిల్వలు నాలుగు బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి.
ఈ పరిణామంతో నిత్యవసరాలను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం అనేక కష్టాలు పడుతూ ఉంది.ఒకపక్క ఆర్థిక సంక్షోభంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా అంధకారంలోకి వెళ్లిపోయింది.
తాజాగా సోమవారం దేశంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.దీంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు తెలియజేశారు.గత మూడు నెలలలో ఈ రీతిగా జరగటం ఇది రెండోసారి.దీంతో విద్యుత్తు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు త్వరలోనే యధాతధంగా విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు తెలియజేశారు.