వ్యవసాయంలో సేంద్రియ ఎరువులకు( Organic fertilizers ) అధిక ప్రాధాన్యం ఇస్తూ, రసాయనిక ఎరువులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తే నాణ్యమైన పంట దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.సేంద్రియ ఎరువుల వల్ల నేల భూసారం పెరుగుతుంది.
రసాయనిక ఎరువుల వల్ల అప్పటికప్పుడు దిగుబడులు పెరిగిన క్రమంగా నేల భూసారం కోల్పోతుంది.కాబట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేయాల్సి ఉంటుంది.
కూరగాయ పంటలలో ప్రధాన పంటగా టమాటా పంట చెప్పుకోవచ్చు.టమాటా పంటలు నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే అధిక ప్రాధాన్యం జీవన ఎరువులకే ఇవ్వాలి.టమాటా నారుమడుల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో చూద్దాం.టమాటా నారు పెంచే నేలను మూడు లేదా నాలుగు సార్లు నాగలితో దుక్కి దున్నుకోవాలి.ఆఖరి దుక్కిలో 40 కిలోల బాగా కుళ్లిపోయిన పశువుల ఎరువు తో పాటు నాలుగు కిలోల సూపర్ ఫాస్ట్ వేసి కలియదున్నాలి.ఆ తర్వాత నేలను శుభ్రం చేసుకోవాలి.
టమాటా నారు ఆరోగ్యకరంగా పెరగాలంటే.నాలుగు మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు నారుమడులను తయారు చేసుకోవాలి.నారుమడులలో నీరు నిల్వకు ఉండకుండా నారుమడుల మధ్య కనీసం 50 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు చూసుకోవాలి.ఒక ఎకరం పొలంలో పది నారుమడులు తయారు చేసుకోవాలి.నారుమడిలో విత్తనాలను 10 సెంటీమీటర్ల ఎడంగా వరుసలలో పైపైన 1-2 సెంటీమీటర్ల లోతులో విత్తాలి.ఒకరోజు తర్వాత నీటి తడి అందించాలి.
టమాట విత్తనాలు( Tomato seeds ) మొలకెత్తివరకు నారుమడిపై ఎండు గడ్డి కప్పాలి.నారు త్వరగా పెరగడం కోసం అధిక మొత్తంలో నత్రజని ఎరువులు, అధిక నీటి తడులు ఇవ్వకూడదు.
ప్రధాన పొలంలో నారు నాటడానికి ముందు ఒక ఎకరాకు రెండు కిలోల అజటోబాక్టర్ ను 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి, నీళ్ళు చల్లుతూ ఓ పది రోజులు మగ్గనిచ్చి ఆఖరి దుక్కిలో వేయాలి.వీటితో పాటు ఒక ఎకరాకు రెండు కిలోల ఫాస్పో బ్యాక్టీరియాను పొలం అంతా సమంగా చల్లుకోవాలి.
ఇక ఆఖరి దుక్కిలో ఒక ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 25 కిలోల భాస్వరం, 25 కిలోల పోటాష్ ఎరువులు వేసుకోవాలి.