ఓటిటీ డీల్ లాక్ చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు.. భారీ ధరకు స్ట్రీమింగ్ రైట్స్!

OTT Deal Locked For Tiger Nageswara Rao Details, Ravi Teja, Pan India Movie, Tiger Nageswara Rao, OTT Deal, Amazon Prime Video, Nupur Sanon, Gayatri Bharadwaj, Tiger Nageswara Rao Ott Rights

మాస్ మహారాజా రవితేజ( Ravi Teja ) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”టైగర్ నాగేశ్వరరావు”.( Tiger Nageswara Rao ) నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు బాగానే ఏర్పడగా నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లింప్స్ తో అంచనాలు డబుల్ అయ్యాయి.

 Ott Deal Locked For Tiger Nageswara Rao Details, Ravi Teja, Pan India Movie, Tig-TeluguStop.com

ఒకేసారి ఐదుగురు స్టార్ హీరోలతో ఐదు భాషల్లో ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

నిజ జీవిత సంఘటనలతో 1970ల కాలంలో గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ కు క్రేజీ రెస్పాన్స్ లభించింది.

5 భాషల్లో ఆడియెన్స్ ను మంచి రెస్పాన్స్ లభించింది.ఇక నిర్మాతలు కూడా భారీ హంగులతో ఎక్కడ తగ్గకుండా అత్యుత్తమ ప్రామాణిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

Telugu Amazon Prime, Nupur Sanon, Ott Deal, Pan India, Ravi Teja, Tigernageswara

ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ హక్కులను ప్రముఖ ఓటిటీ సంస్థ కొనుగోలు చేసినట్టు టాక్.అమెజాన్ ప్రైమ్ వీడియో( Amazon Prime Video ) వారు భారీ ధరతో ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను తీసుకున్నట్టు టాక్ వస్తుంది.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు.

Telugu Amazon Prime, Nupur Sanon, Ott Deal, Pan India, Ravi Teja, Tigernageswara

అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాను అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.దీంతో అప్పటికి ఈ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ చేసి భారీ ఓపెనింగ్స్ కు ప్లాన్ చేసుకుంటున్నట్టు టాక్.మరి ఈ అవైటెడ్ సినిమా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube