మున్సిపల్ కార్మికులను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది.ఈ మేరకు సెక్రటేరియట్ లో మధ్యాహ్నం 3 గంటలకు కార్మిక సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది.
చర్చల్లో ప్రభుత్వం తరపు నుంచి మంత్రులు ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొనే అవకాశం ఉంది.కాగా ఇప్పటికే కార్మికులతో రెండు విడతులగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరపగా అవి సఫలం కాలేదు.
గత పన్నెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.సమాన పనికి సమాన వేతనంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.