టెక్సాస్ కాల్పుల ఎఫెక్ట్.. ఇక టీచర్ల చేతికి ఆయుధాలు, కీలక బిల్లుకు ఓహియో ఆమోదం

ఇటీవల టెక్సాస్ రాష్ట్రంలోని ఓ పాఠశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఇందులో 19 మంది చిన్నారులే కావడం దురదృష్టకరం.

 Ohio Passes Bill That Would Allow Teachers To Go Armed In Schools With Minimal T-TeluguStop.com

ఈ సంఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.అంతేకాదు.

దేశంలో నానాటికీ తీవ్రమవుతున్న తుపాకీ సంస్కృతికి చరమ గీతం పడాలని అక్కడి ప్రజలు , ప్రజా సంఘాలు, పలువురు చట్టసభ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.కానీ శక్తివంతమైన గన్ లాబీ ముందు వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.

కఠినమైన తుపాకీ చట్టాలను తీసుకురావాలని డెమొక్రాట్లు కోరుతుంటే.దీనికి రిపబ్లికన్లు మాత్రం ససేమిరా అంటున్నారు.

అయితే ఉన్మాదులు, దుండగుల బారి నుంచి అమాయకుల ప్రాణాలు కాపాడేందుకు పలు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి.దీనిలో భాగంగా.రిపబ్లికన్ల ఏలుబడిలో వున్న ఓహియో రాష్ట్రం ముందడుగు వేసింది.టీచర్లు, స్కూల్ సిబ్బంది తమ వెంట గన్‌లు తెచ్చుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన బిల్లుకు ఆ రాష్ట్ర చట్టసభలు ఆమోదముద్ర వేశాయి.

ఇందుకోసం వారు తొలుత.తుపాకులు వినియోగంపై శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఈ బిల్లుపై సంతకం చేసి అమల్లోకి తెస్తానని ఓహియో గవర్నర్ మైక్ డీవైన్ పేర్కొన్నారు.

టెక్సాస్ కాల్పుల తర్వాత వెంటనే ఓహియో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.

బుధవారం సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో 23-9 ఓట్లతో ఆమోదం లభించింది.ఆ వెంటనే దిగువ సభ కూడా 56-34 ఓట్ల తేడాతో బిల్లును ఆమోదించింది.

పాఠశాలలో తుపాకీని తీసుకెళ్లేందుకు టీచర్ లేదా ఉద్యోగికి చెల్లుబాటయ్యే గన్ లైసెన్స్ వుండాలని బిల్లు పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube