ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది, అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఎవరు ఊహించని విధంగా జైలుపాలు కావడం, ఆయన ఎప్పుడు బయటకు వస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడం వంటి కారణాలతో టీడీపీని లీడ్ చేసేదేవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.నారా లోకేశ్ ఉన్నప్పటికి కూడా ఆయన చుట్టూ కూడా స్కామ్ ల బెడద అలుముకుంటోంది.
ఇక నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే ఆయన దురుసు స్వభావం పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట.
దీంతో నారా బ్రహ్మణిని బరిలోకి దించితే మేలు అని పార్టీలో కొందరు నేతలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కూడా అదే విషయాన్ని ఇటీవల స్పష్టం చేశారు.లోకేశ్ కూడా అరెస్ట్ అయితే నారా బ్రహ్మణి పార్టీని ముందుండి నడిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక సీనియర్ నేతలంతా కూడా నారా బ్రహ్మణి( Nara Brahmani ) నాయకత్వానికే జై కొడుతున్నట్లు సమాచారం.అయితే పార్టీలో ఒక వర్గం మాత్రం జూ.ఎన్టీఆర్ ( Jr ntr )పార్టీ బాద్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నారట.పార్టీకి కష్టకాలంలో తన మద్దతు ఎప్పుడు ఉంటుందని ఎన్టీఆర్ గతంలోనే స్పష్టం చేశారు.
దాంతో ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే మేలనేది కొందరి అభిప్రాయం.అయితే ఎన్టీఆర్ రాకను కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యతిరేకీస్తున్నట్లు తెలుస్తోంది.ఆ మద్య అచ్చెనాయుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తాము ఎవరిని స్పందించమని కోరమని, పార్టీకి ఎవరో వచ్చి ఏదో చేయాలని ఆశించడం లేదంటూ వ్యాఖ్యానించారు.అటు నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రకంగానే స్పందించారు.
దీంతో ఎన్టీఆర్ పార్టీలోకి రావడాన్ని సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం.ఆ కారణాల చేతనే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు స్పందించలేదని కొందరి వాదన.
మొత్తానికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల చుట్టూ స్కామ్ లు అలుముకుంటున్న వేళ.ముందు రోజుల్లో టీడీపీని ఎవరు లీడ్ చేస్తారో చూడాలి.