ఎన్టీఆర్ భీముడి పాత్రలో నటిస్తే సెటైర్స్ వేసిన వారెవరు ?

ఎన్టీఆర్.శ్రీకృష్ణుడి పాత్రలో ఆయన్ను చూసిన వారు నిజంగా దేవుడు ఇలాగే ఉంటాడు కాబోలు అనుకునే విధంగా కనిపించి జనాల హృదయాలను దోచుకున్నాడు.

 Ntr Role As Bheema In Pandava Vanavasam Details, Ntr, Nandamuri Taraka Rama Rao,-TeluguStop.com

నాటి కాలంలో శ్రీకృష్ణుడు అయినా, రాముడు అయినా అన్ని అన్న గారే.ఆలా ఎన్నో పాత్రలకు ప్రాణం పోసాడు.

ఆయన్ను ఆలా తెరపై చూస్తుంటే కేవలం నటించడానికే పుట్టాడా ఈ మహానుభావుడు అన్నట్టుగా ఉండేవారు.కానీ ఎన్టీఆర్ ఒక పాత్ర చేస్తుంటే మాత్రం అందరు సెటైర్స్ వేయడం జరిగింది.

ఈ సంఘటన ఇప్పుడు వింటే కొత్తగా, వింతగా అనిపిస్తున్న అప్పట్లో పీలగా ఉండే ఎన్టీఆర్ ని చూస్తే చాల మంది అలాగే అనుకున్నారు.

ఇంతకీ అంతలా ఎన్టీఆర్ సూట్ కానీ ఆ పాత్ర ఏంటో తెలుసా ? అది భీముడి పాత్ర. ఇక తీస్తున్న సినిమా పేరు పాండవ వనవాసం.నిజానికి ఈ సినిమాలో తొలుత శ్రీకృషుడి పాత్రలో ఎన్టీఆర్ ని ఫిక్స్ అవ్వగా భీముడి పాత్రదారుడి కోసం కసరత్తు మొదలయింది.

ఈ సినిమాకు దర్శకత్వం వహించింది కమలాకర కామేశ్వర రావు.ఎంతో పెద్ద సినిమా తీయాలని అయన భావించాడు.చాల మంది ఆర్టిస్టులను బుక్ చేసుకున్నాడు.అయితే భీముడి కోసం ఎవరిని ఎంచుకోవాలో అర్ధం కాలేదు.

భీముడు అంటే మంచి బలశాలి అయి ఉండాలి.సినిమాకు అతడే మెయిన్ క్యారెక్టర్.

మంచి బలమైన్ కథ కాబట్టి బలమైన భీముడి పాత్ర కోసం చాల మందిని చూసాడు.

Telugu Nandamuritaraka, Sr Ntr, Srntr-Movie

పాండవులు జూదం లో ఓడిపోయి 14 ఏళ్ళు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన మొత్తం కథతో సినిమా తీయాలన్న సినిమా లెన్త్ ఎక్కువ అవుతుందని భావిచిన తరుణంలో కేవలం పాండవుల వనవాసం వరకే పరిమితం చేసాడు దర్శకుడు.అయితే బలశాలి అయినా బీముడు దొరక్కపోవడం తో ఎన్టీఆర్ చేత భీముడి వేషం వేయించాలి నిర్ణయించుకున్నాడు దర్శకుడు.అయితే అప్పటికి సన్నగా ఉన్న ఎన్టీఆర్ ని చూసి అందరు ఖంగు తిన్నారు.

ఇతడు భీముడు ఏంటి వద్దు అంటూ దర్శకుడికి సలహాలు కూడా ఇచ్చారు.అయినా కూడా ఎన్టీఆర్ అంటే ఆయనకు ఒక నమ్మకం.

దాంతో అయన నడక, బాడీ లాంగ్వేజ్ మర్చి, కాస్త కెమెరా జిమ్మిక్కులు జోడించి సినిమా విడుదల చేయగా ఘనవిజయం సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube