తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగో రోజు భారత్ జోడో యాత్ర ముగిసింది.ఈ క్రమంలో జడ్చర్ల జంక్షన్ లో ఏర్పాటు చేసి సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.
టీఆర్ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధించారు.టీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటేనన్నారు.
ఢిల్లీలో బీజేపీ ఏం చేస్తోందో, ఇక్కడ టీఆర్ఎస్ అదే చేస్తోందని ఆరోపించారు.పాదయాత్రలో భాగంగా రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారులతో మాట్లాడుతున్నానన్న రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోన్నానని వెల్లడించారు.
రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ కారణంగా చేనేత కార్మికులు ఎంతో నష్టపోతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులను, నేతన్నలను ఆదుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.