రాహుల్ గాంధీతో చేతులు కలిపిన పూనమ్ కౌర్.. ఇదేం ట్విస్ట్ రా బాబు నెటిజన్స్ ట్రోల్స్!?

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో యువత హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ తన నటనతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

 Poonam-kaur In Rahul Gandhi Barath Jodo Yatra Details, Poonam Kaur, Congress, Ra-TeluguStop.com

మాయాజాలం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.

ఇక సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది పూనమ్ కౌర్. తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.

ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్ లు మాత్రం కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి.అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి.

ఇక రాజకీయ పట్ల కూడా వ్యతిరేకంగా బాగా కౌంటర్లు వేస్తుంటుంది.

ఎప్పుడు ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతుంది.

ఈమె సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే మాత్రం క్షణాలో అది వైరల్ అవుతుంది.అలా ఇప్పటికీ ఆమె చేసిన పోస్ట్ వల్ల చాలా వివాదాలు తలెత్తాయి.

అయినా కూడా వాటిని పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా ట్వీట్లు చేస్తుంది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ ముద్దుగుమ్మ అందరికీ సడన్ షాక్ ఇచ్చింది.

Telugu Congress, Poonam Kaur, Pawan Kalyan, Poonamkaur, Rahul Gandhi, Rahulgandh

ఇంతకు అసలు విషయం ఏంటంటే.ప్రస్తుతం ఇండియాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ఇటీవలే జోడో పాదయాత్ర తెలంగాణలోకి కూడా ప్రవేశించింది.అయితే ఈరోజు ఉదయం రాహుల్ గాంధీ పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా ధర్మపురి లో ప్రారంభం అవ్వగా ఆ పాదయాత్రలో పూనం కౌర్ దర్శనమిచ్చింది.

ఏకంగా రాహుల్ గాంధీ తో పాదయాత్ర చేసింది.దీంతో ప్రస్తుతం ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

ఆమె ఉస్మానియా విద్యార్థులతో రాహుల్ ని కలిసి పాదయాత్రతో ముందుకు సాగుతూ ఆయనతో మాట్లాడుతున్న వీడియో కూడా బాగా వైరల్ అయింది.ఇక ఆమె వైట్ శారీలో కనిపించగా అచ్చం రాజకీయ నాయకురాలిగా అందరి దృష్టిలో పడింది.

Telugu Congress, Poonam Kaur, Pawan Kalyan, Poonamkaur, Rahul Gandhi, Rahulgandh

దీంతో ఈమె ఇంత సడన్ గా రాహుల్ గాంధీ పక్కన నడవటం ఏంటి అంటూ.అసలు ఈ ట్విస్ట్ ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.ప్రస్తుతం ఈ విషయం గురించి ఎటువంటి క్లారిటీ లేకపోగా.బహుశా ఆమె రాజకీయాల్లో కూడా చేరి అక్కడ కూడా తనేంటో నిరూపించాలనుకుంటుందేమో అని అనుకుంటున్నారు.పైగా నిత్యం పవన్ కళ్యాణ్ ను ఇన్ డైరెక్ట్ గా బాగా టార్గెట్ చేస్తూ ఉంటుంది.దీంతో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీతో ఆమె అలా మద్దతు పలుకుతుందేమో అని అనుమానిస్తున్నారు.

మొత్తానికి ఈ విషయం బాగా వైరల్ అవ్వడంతో.ఇదేం ట్విస్ట్ రా బాబు అంటూ నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube