ప్రభాస్ నటించిన తాజా పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’.( Adipurush ) ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ ( Kriti Sanon) సీతగా.సన్ని సింగ్ లక్ష్మణుడిగా నటించారు.హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు.ఓమ్ రౌత్( Om Raut ) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది .భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.అంతేకాక ఈ సినిమాతో ప్రభాస్ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.
బాహుబలి, బాహుబలి 2, సాహో తర్వాత అమెరికాలో ఆదిపురుష్ 3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది.దీంతో తెలుగులో మరే ఇతర టాలీవుడ్ హీరోకి దక్కని రికార్డు ప్రభాస్ సొంతం అయింది .ఇక ప్రభాస్ తరువాత రామ్ చరణ్ 2, జూనియర్ ఎన్టీఆర్అల్లు అర్జున్, మహేష్ బాబులకి ఒక్కో మూడు మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్నాయి .ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నా .సినిమాపై ఇప్పటికి విమర్శలు వస్తున్నాయి ఈ సినిమాలో రావణుడు గెటప్ పైనా, హనుమాన్ చెప్పిన డైలాగులు పైనా విమర్శలు వచ్చాయి.మినిమం బాధ్యత లేకుండా సినిమా తీసారని విమర్శిస్తున్నారు.
దానికి తోడు రైటర్ వచ్చి మరీ వివరణలు ఇవ్వటం, అవీ నెగిటివ్ అవటం మరింత ఆందోళనగా మారింది.ఈ క్రమంలో సోషల్ మీడియా .తారక్ పాత వీడియో ఒకటి వైరల్ చేస్తున్నారు. జై లవకుశ సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ రావణుడి పాత్ర వేసినప్పుడు రామాయణంతో పాటు రావణుడి గురించి ఎక్కడ సమాచారం సేకరించాడో తెలిపాడు.
పౌరాణికానికి సంబంధించిన సినిమాలు చేస్తున్నప్పుడు అందులోని పాత్రల సమాచారం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు.కానీ అందులోని విషయాన్ని పాడు చేయకుంటే చాలని ఎన్టీఆర్ ఇలా తెలిపాడు.
జై లవకుశ సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.ఆనంద్ నీలకంఠ రాసిన అసుర అనే పుస్తకాన్ని చదివాను.
రావణుడు అసురుల చక్రవర్తి .
అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి.అలాంటి వ్యక్తి కళ్లు ఎలా ఉండాలి.ఇవన్నీ రావణుడిలో కనిపించాలి.
అందుకే రాముడు కూడా యుద్ధం సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని అంటాడు .అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి.అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి.అన్న విషయాలను తెలుసుకున్నాను అని ఆ వీడియోలో పేర్కొన్నాడు .అసలు జై లవకుశ సినిమా పౌరాణికం కాదు…అందులోనూ చిన్న పాత్ర అయినా ఎన్టీఆర్ ఎంతో పరిశోధన చేశారని .మరి ఆదిపురుష్ టీమ్ ఏమి చేసిందని అంటున్నారు .అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ అభిమాన నటుడుని సమర్థిస్తున్నారు .ప్రభాస్ ముందే చెప్పారని .అయితే దర్శకుడు రౌత్ వినలేదని .అదే విమర్శలకు కారణమని అంటున్నారు .