నల్లగొండ జిల్లా: మొన్నటివరకు వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు జూన్ వచ్చిందంటే చాలు హమ్మయ్యా! అని ఊపిరి పీల్చుకుంటారు.ఎందుకంటే ఋతుపవనాలు మారి ఒక్కసారిగా తొలకరి జల్లులు ప్రారంభమవుతాయి.
వర్షాకాలం( Rainy season ) అంటే చల్లగా హాయిగా ఉంటుందని భావిస్తాం.కానీ,ఇది వ్యాధులు ముసురుకునే కాలం.
అంతేగాదు మిగతా కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో వైరస్‌లు, బ్యాక్టీరియా,ఇతర ఇన్‌ఫెక్షన్‌లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.దీంతో జలబు, దగ్గు,గొంతులో కఫం,వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారినపడతారు.
దీనికి తోడు దోమల( Mosquitoes ) బెడద కూడా ఎక్కువ అవ్వడంతో మలేరియా,డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ.ఈ కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు వరకు అందరూ ఆయా వ్యాధుల బారిన పడుతుంటారు.
అలాంటి సమయంలో మన ఇంట్లో ఉండే వాటితోనే చక్కటి ఔషధాలు తయారు చేసుకుని సులభంగా ఆయా వ్యాధుల బారినపడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇల్లు,ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూదు.
దోమలు లేకుండా ఉండేలా చేసుకోండి.నిండుగా దుస్తులు ధరించండి.
బయట వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి శరీరం వెచ్చగా ఉండేలా మంచి దుస్తులు ధరించండి.తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోండి.
పచ్చికాయగూరలు తినొద్దు.మరిగించి చల్లార్చిన నీటిని తాగండి.
ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటూ మన ఇంట్లో ఉండే మసాల దినుసులతో ఈ కషాయాన్ని తయారు చేసుకుని సేవిస్తే ఆయా వ్యాధుల బారిన పడుకుండా ఉండోచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.కషాయం తయారు చేసే విధానం…ధనియాలు( Coriander ): రెండు స్పూన్లు,లవంగ-4, యాలుకలు-2,దాల్చిన చెక్క- అంగుళం ముక్క, మిరియాలు-8,జీలకర్ర- అరస్పూన్,అల్లం లేదా శోంఠి:అర అంగుళం ముక్క తయారీ విధానం: పైన చెప్పిన వాటిని అన్నింటిని దంచుకుని పొడి చేసుకుని ఓ డబ్బాలో స్టోర్ చేసుకుండి.కాచిన నీటిలో ఈ పొడిని చిటికెడు వేసుకుని,ఉప్పు వేసుకుని తాగొచ్చు లేదా నిమ్మరసం కలుపుకుని పరగడపున తీసుకుంటుంటే వర్షాకాలంలో వచ్చే ఎలాంటి వ్యాధులు మీ దరిదాపుల్లోకి వచ్చే అవకాశం చాలా తక్కువ అని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు.







