2022లో సెంట్రల్ ఇంగ్లాండ్‌లో ( England )ఛార్జీ విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌ను హత్య చేసిన వ్యక్తిని కోర్ట్ దోషిగా నిర్ధారించింది .2022 అక్టోబర్‌లో 59 ఏళ్ల అనఖ్ సింగ్ ( Anakh Singh )హత్యకు సంబంధించి 36 ఏళ్ల టోమాస్జ్ మార్గోల్‌ను వోల్వర్ హాంప్టన్ క్రౌన్ కోర్ట్ దోషిగా తేల్చింది.ఈ నేరానికి గాను వచ్చే నెలలో మార్గోల్‌కు శిక్ష విధించనున్నారు.వోల్వర్ హాంప్టన్ పోలీస్ సీఐడీకి చెందిన డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ మిచెల్ థుర్‌గుడ్( Michelle Thurgood ) మాట్లాడుతూ.
ఇది హింసాత్మక ఘటనగా అభివర్ణించారు.
అక్టోబర్ 20,2022 ఉదయం అనఖ్ సింగ్ తీవ్రగాయాలతో నైన్ ఎల్మ్స్ లేన్‌లో తీవ్ర గాయాలతో పడిపోయి కనిపించాడు.
ఘటన జరిగిన రోజున నిందితుడు మార్గోల్‌ను సింగ్ తన క్యాబ్‌లో ఎక్కించుకున్నాడు.ఘర్షణ సమయంలో అనఖ్ సింగ్‌ను నిందితుడు నేలపై పడేసి కొట్టాడు.
ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మార్గోల్‌ను గుర్తించారు.మరుసటి రోజే.
ఘటనాస్థలికి కొన్నిమైళ్ల దూరంలో వున్న ఇంటి నుంచి నిందితుడిని అరెస్ట్ చేశారు.మార్గోల్ అరెస్ట్, దర్యాప్తు, దోషిగా తేలిన వ్యవహారంపై అనఖ్ సింగ్ కుటుంబం స్పందించింది.
ఈ క్లిష్ట సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా.గతేడాది అక్టోబర్‌లో భారత సంతతికి చెందిన బ్రిటీష్ సిక్కు ఎంపీ ప్రీత్ కౌర్ గిల్( MP Preet Kaur Gill ).ఆ దేశ హోంశాఖ కార్యదర్శి సుయెల్లా బ్రేవర్‌మాన్‌కు రాసిన లేఖలో బ్రిటన్‌లో సిక్కులపై జరుగుతున్న విద్వేష నేరాలపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.2021-22 ఏడాదికి సంబంధించి ద్వేషపూరిత నేర గణాంకాలను ఉటంకిస్తూ.అవి 169 శాతం పెరిగాయని, 38 శాతం మతపరమైన నేరాలు పెరిగాయని ప్రీత్ కౌర్ తన లేఖలో పేర్కొన్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం.బ్రిటన్‌లో 3,36,000 మంది సిక్కులు నివసిస్తున్నారు.2021-22లో సిక్కులపై 301 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయిని.2020-21లో 112 కేసులు నమోదయ్యాయని గిల్ తెలిపారు.సుయెల్లాతో పాటు లెవలింగ్, హౌసింగ్, కమ్యూనిటీస్ (డీఎల్‌యూహెచ్‌సీ) విభాగం సెక్రటరీ సైమన్ క్లార్క్‌కు కూడా లేఖను పంపారు.2020లో బ్రిటీష్ సిక్కులపై ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ (ఏపీపీజీ) నివేదికను అమలు చేయాలని గిల్ తన లేఖలో బ్రేవర్‌మాన్‌ను కోరారు.







