ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్( Chandrababu Naidu arrest ) కంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదనే చర్చ జరుగుతోంది.నామమాత్రంగా అయినా జూనియర్ ఎన్టీఆర్ స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇకపై జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూడబోమని టీడీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇంతకాలం తారక్ కు తాము అండగా నిలిచామని ఇకపై అండగా నిలబడే ఛాన్స్ లేదని వెల్లడిస్తున్నారు.
అయితే ఈ విధంగా కామెంట్లు చేసేవాళ్లకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం సమాధానం చెబుతున్నారు.సినిమాను చూడాలో వద్దో వ్యక్తిగత ఇష్టమని సినిమా చూడాలని ఎవరూ బలవంతం చేయరని ఫ్యాన్స్ చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ను అనవసర వివాదాల్లోకి, రాజకీయాల్లోకి లాగవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చంద్రబాబు అరెస్ట్ గురించి ఇంకా చాలామంది స్పందించలేదని కానీ ఎన్టీఆర్ నే టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) గతంలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడని విమర్శించే వాళ్లు ఆ విషయాలను సైతం గుర్తుంచుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా అడుగులు వేస్తున్నారు.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.దేవర సినిమాలో తారక్ నటిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
దేవర( Devara ) తర్వాత తారక్ సినిమాలు సైతం నెక్స్ట్ లెవెల్ లో భారీ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.ఈ సినిమా స్క్రిప్ట్ కోసమే దాదాపుగా రెండేళ్ల సమయం కేటాయించారని తెలుస్తోంది.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనుందని తెలుస్తోంది.వచ్చే ఏడాది మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం అందుతోంది.