ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా 'నీరా కేఫ్'

హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నా ‘నీరా కేఫ్’ పనులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారుల తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యం తో హైదరాబాద్ లోని ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డు లో 25 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్ట మొదటి సారిగా నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.

 Nira Cafe Is Being Ambitiously Built Under The Auspices Of The Excise Department-TeluguStop.com

ఉమ్మడి రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా కొనసాగిస్తూ.ప్రజలకు ఆరోగ్యాన్ని , 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లు ను హైదరాబాద్ నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు.

గీత వృత్తిని, వృత్తి దారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంత మంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి ప్రాథమికంగా యాదాద్రి భువనగిరి జిల్లా లోని నందనం గ్రామంలో, సంస్థాన్ నారాయణ పురం మండలం సర్వేలు గ్రామంలో, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మునిపల్లి గ్రామంలో, రంగారెడ్డి జిల్లా లోని ఆమనగల్లు మండలం చరికొండ గ్రామంలో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు. గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు.గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియా ను రైతు బంధు తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.ఆత్మ గౌరవ భవనాల ను నిర్మిస్తున్నామన్నారు.

కుల, చేతి వృతుల పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ గారు అనేక చర్యలు చేపట్టానున్నారు మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర BC కమిషన్ సభ్యులు K.కిషోర్ గౌడ్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం MD మనోహర్, ఉప్పల్ RTO పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర ప్రతి నిధులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, నాగేశ్వరరావు గౌడ్, వేములయ్య గౌడ్, ప్రశాంత్ గౌడ్, అయిలీ వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, ఈతముల్లు ప్రసాద్, మమత గౌడ్,గడ్డమీడి విజయ్ కుమార్ గౌడ్, సంజయ్ గౌడ్ లతో పాటు ప్రొహిబిషన్& ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్ రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్ గౌడ్, CI లు లక్ష్మణ్ గౌడ్, తమటం లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube