మెగా డాటర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ప్రస్తుతం ఒక వ్యక్తి రిస్తూ రాబోతోంది.
ఓసీఎఫ్ఎస్ అంటూ రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ఏంటో గెస్ చేయమంటూ నెటిజన్లకు చాలెంజ్ విసిరింది నిహారిక.ఈ ఓసీఎఫ్ఎస్ అంటే ఏంటో చెప్పగలరా అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేసింది.
ఇక ఈ విషయంపై నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారిలో ఉన్న క్రియేటివిటీని బయటపెట్టారు.ఈ నేపథ్యంలోనే కొందరు క్రేజీ గా చెప్పిన సమాధానాలకు నిహారిక కూడా రిప్లై ఇచ్చింది.
ఒకడు ఓకే కప్ బోర్డులో ఫైవ్ సొక్కాలు అని ఒకడు అంటే.దీనికి నిహారికా స్పందిస్తూ చెవులు మూసుకుని ఆశ్చర్యపోయిన ఎమోజి ని షేర్ చేసింది.ఆన్లైన్ క్లాస్ ఫర్ స్టూడెంట్ అని మరొక నెటిజన్ కామెంట్ చేయగా.అందుకు నిహారిక చదువు బిడ్డ అని కాంప్లిమెంట్ ఇచ్చింది.
మరొక నెటిజన్ ఒక్క చిన్న ఫసక్ స్టోరీ అని కామెంట్ చేయగా, ఇంకొకడు వన్ కరోనా ఫ్రీ సొసైటీ అంటూ కామెంట్ చేశాడు.అవును ఇప్పుడు ఇది మనకు చాలా అవసరము అంటూ నిహారిక రిప్లై ఇచ్చింది.

ఒక నెటిజన్ ఒక చికెన్ ఫ్రై స్టోరీ అంటూ కామెంట్ చేయగా.లంచ్ టైం అయింది.నాకు నీ బాధ అర్థం అయింది అంటూ నిహారిక కౌంటర్ వేసింది.ఒంటరి చిన్నోడు ప్రస్టేటెడ్ సుందరి అని కామన్ చేయగా నాకు బాగా నచ్చింది అని నిహారిక రిప్లై ఇచ్చింది.
ఒక కోవిడ్ ఫ్రెండ్ స్టోరీ అని ఇంకో నెటిజన్ రిప్లై ఇవ్వగా.నహీ అని రిప్లై ఇచ్చింది.వన్ సిండ్రెల్లా ఫ్రమ్ శ్రీకాకుళం అని చెబితే.బాగుంది అని మెచ్చుకుంది నిహారిక.
ఒరేయ్ కెమెరా ఫస్ట్ సూడు అని ఇంకో నెటిజన్ అంటే.నాకు అర్థం కాలేదు సార్ అని నిహారిక నవ్వేసింది.
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్ చేయగా.నిహారిక తనదైన రీతిలో స్పందించింది.