ఇంటి భద్రత కోసం సీసీ కెమెరాలు( CCTV ) ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ గార్డ్ లను నియమించుకోవడం చేసిన కూడా కొన్ని సందర్భాల్లో దొంగలు ఇళ్లల్లోకి చోరబడి దొరికినంత వరకు దోచేస్తున్నారు.ప్రస్తుత కాలంలో ఇంటికి తాళం వేసి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతున్నారు.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు, దొంగల నుంచి మీ ఇంటిని సంరక్షించేందుకు ప్రముఖ సుప్రసిద్ధ సంస్థ Xiaomi త్వరలోనే కొత్త వీడియో డోర్ బెల్ ప్రారంభించనుంది.ఈ డోర్ బెల్ ఫీచర్లు ఏమిటో చూద్దాం.
Xiaomi కొత్త స్మార్ట్ డోర్ బెల్( New Smart Doorbell ) కు డోర్ బెల్ 3S అని పేరు పెట్టారు. Xiaomi కంపెనీకి చెందిన మెరుగైన వెర్షన్.
Xiaomi ఇటీవలే తన గ్లోబల్ సైట్ లో స్మార్ట్ డోర్ బెల్ 3S ను విడుదల చేసింది.
ఈ డోర్ బెల్ ను అమెజాన్ వెబ్ సైట్( Amazon ) లో కొనుగోలు చేయవచ్చు.మిగతా కంపెనీలకు చెందిన డోర్ బెల్ లతో పోలిస్తే దీని ధర కాస్త ఎక్కువగానే ఉంది.ఈ Xiaomi కొత్త స్మార్ట్ డోర్ బెల్ 3S ఫీచర్ల విషయానికి వస్తే.2k రిజల్యూషన్ వీడియో నాణ్యత, 180- డిగ్రీల వీక్షణ, లైవ్-టైమ్ పర్యవేక్షణ, మోషన్ అలర్ట్, డోర్ చైమ్, 72 గంటల వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్( Free Cloud Storage ) ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ డోర్ బెల్ 3S 5200mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.దుమ్ము, నీటి రక్షణ కోసం IP 65 రేట్ ను కలిగి ఉంది.వైర్ల ద్వారా ఈ బెల్ ను కనెక్ట్ చేయవచ్చు.
వైఫై 6 కనెక్టివిటీ, వైడ్ డైనమిక్ రేంజ్ సపోర్ట్, అడ్జస్టబుల్ నైట్ విజన్ శక్తిసామర్థ్యాలను కలిగి ఉంటుంది.పాత డోర్ బెల్ కంటే ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండడం వల్ల ఇంటికి మరింత సంరక్షణగా ఉండనుంది.