మంగళగిరిలో పరిస్థితి ఏంటో ? సర్వేలు చేయిస్తున్న లోకేష్ ?

ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు కాని ఆ పార్టీలో కీలక నాయకులుగా చెప్పుకుంటున్న వారందరికి ఈ ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవనే సంకేతాలు మాత్రం వస్తున్నాయి.ఏపీలో కొన్ని కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో తెలియక అన్ని అన్ని పార్టీల్లోనూ అయోమయం నెలకొంది.

 Nara Lokesh Survey In Mangalagiri Constituency-TeluguStop.com

అటువంటి కీలక నియోజకవర్గాల్లో మంగళగిరి ప్రధానంగా కనిపిస్తోంది.ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు తనయుడు లోకేష్ పరిస్థితి ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.

అంతే కాదు ఈ అంశంపై భారీ బెట్టింగులు సాగుతూ ఉన్నాయి.కొందరేమో లోకేష్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తుంటే మరి కొందరు లోకేష్ గెలవడం అసంభవం అంటూ ఖరాకండిగా చెప్పేస్తున్నారు.

చినబాబు గెలుపోటముల మీద అయితే భారీ స్థాయిలోనే పందేలు కాస్తున్నారు.వీరిలో ఎక్కువమంది లోకేష్ ఓటమి మీద పందేలు కాస్తున్నారట.ఆయన గెలుపుపై పందెం కాసేవారు తక్కువగా ఉన్నారు.లోకేష్ గెలుస్తాడంటూ ఒక రూపాయి బెట్ కాస్తే నిజంగానే అది జరిగితే దానికి రెండు రూపాయలు దక్కే పరిస్థితి ఉందట.

రూపాయికి రెండు రూపాయలు.అనేది నారా లోకేష్ విజయం మీద సాగుతున్నపందెం.

లోకేష్ ఖచ్చితంగా ఓడిపోతారు అంటూ బెట్ కాసే వాళ్లకు ఎక్కువమంది ఉండటం ఈ పరిస్థితికి కారణం.ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గెలుపుపై మాత్రం భారీగానే పందేలు కాసేవారు ఎక్కువయ్యారు.

ఒకదశలో ఆయనకు వైసీపీ టికెట్ దక్కదనే ప్రచారం జోరుగా సాగింది.కానీ అనూహ్యంగా టికెట్ దక్కించుకుని ఇప్పుడు విజయం వైపు దూసుకెళ్తున్నట్టుగా కనిపిస్తున్నారు.

వైసీపీ అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఖచ్చితంగా ఐదు, ఆరు వేలు మెజార్టీ వస్తుందనే లెక్కలు వేస్తున్నారు.ఇక్కడ పరిస్థితి గురించి ఆందోళనగా ఉన్న టీడీపీ అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనే విషయంపై సర్వేలు చేయిస్తున్నారట.అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు ? ఏ వర్గం వారు టీడీపీ వైపు మొగ్గుచూపారు ? టీడీపీకి ఓటు వేయడానికి ఇష్టపడని వర్గాలు ఏంటి ? ఏ కారణంతో వారు దూరం అయ్యారు ? అసలు టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశం ఉంది ? తదితర అంశాల గురించి సర్వే చేయిస్తున్నారట.అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనేది మాత్రం మే 23 వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube