చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) అరెస్ట్ అయిన తర్వాత సతీమణి నారా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రాజమండ్రిలోనే ఉంటున్న సంగతి తెలిసిందే.ప్రతివారం ములాఖాత్ ద్వారా చంద్రబాబుని కలుస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీ నిర్వహించే నిరసన కార్యక్రమాలలో కూడా పాల్గొని.కార్యకర్తలలో ధైర్యం నింపుతున్నారు.
చంద్రబాబు అరెస్టు పట్ల తనకు సంఘీభావం తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధైర్యం చెబుతూ కచ్చితంగా న్యాయం గెలుస్తుంది అని భరోసా ఇస్తున్నారు.పరిస్థితి ఇలా ఉంటే గురువారం ట్విట్టర్ లో నారా భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు పట్ల కాస్త ఎమోషనల్ తరహాలో పోస్ట్ పెట్టడం జరిగింది.
“ఈరోజు ఏపీ ప్రజల్లో గాని తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) కార్యకర్తల్లో గాని ఒకటే ఆవేదన.అసలు చంద్రబాబు గారు ఏం తప్పు చేశారని జైల్లో పెట్టారు ఆంధ్రప్రదేశ్ నీ అభివృద్ధి చేసినందుకా? ప్రజలు ఆనందంగా ఉండాలి, ఉన్నతంగా జీవించాలి అని తపించినందుకా? అదే తప్పు అంటే ప్రజలకు దిక్కెవరు.?” అని ప్రశ్నించారు ఇదే సమయంలో తనకు సంఘీభావం తెలుపుతున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.“చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుపై తనకు సంఘీభావం తెలుపుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు.చంద్రబాబు గారు బయటకు రావాలని ప్రార్థనలు చేస్తున్న మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి సోదరుడికి ప్రతి మహిళకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అంటూ ట్విట్టర్ లో నారా భువనేశ్వరి ట్విట్ చేయడం జరిగింది.