యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మోస్తారు కలెక్షన్లతో ముందుకు సాగుతోంది.ఓవర్సీస్ లో ఇప్పటికే లాభాల బాట పట్టగా, మిగితా ఏరియాల్లో లాభాలు రావాలంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలి.
అయిదు రోజుల వీకెండ్ , అన్ని సెలవులే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల మార్కు దగ్గరికి చేరుకుంది ఈ చిత్రం.ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిగర్ 35 – 37 కోట్ల షేర్ మధ్య ఉంటుంది.
మొదటి అయిదు రోజుల కలెక్షన్లలో బాహుబలి,శ్రీమంతుడు,అత్తారింటికి దారేది తరువాత నాలుగోస్థానం నాన్నకు ప్రేమతోది.