క్యాలెండర్ తిప్పుతున్న నాని

నేచరుల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వి’ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టకున్నాయి.

 Nani Selecting Dates For His Movies Release   Nani, V Movie, Sudheer Babu, Nived-TeluguStop.com

ఈ సినిమాతో నాని మరోసారి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాలో నాని తొలిసారి నెగెటివ్ రోల్‌లో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాలో మరో హీరో సుధీర్ బాబు నటిస్తుండటం, నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్‌లుగా నటిస్తుండటంతో ఈ సినిమాలో ఎలాంటి ట్విస్టులు ఉంటాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఈ సినిమా తరువాత నాని టక్ జగదీష్ అనే సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.

కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ రెండు సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్‌లను వాయిదా వేసుకున్నాడు.

వి చిత్రాన్ని మార్చి చివరినాటికి రిలీజ్ చేయాలని చూసినా అది సాధ్యం కాకపోవడంతో, ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

కాగా టక్ జగదీష్ చిత్రాన్ని జూలై నుండి సెప్టెంబర్‌కు వాయిదా వేయాలని నాని అనుకుంటున్నాడు.మరి ఈసారైనా అనుకున్న సమయాలకు రెండు సినిమాలు రిలీజ్ అవుతాయా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube