అవకాశాలు లేక చివరికి యాంకర్ గా మారబోతున్న టాప్ హీరోయిన్...

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సరసన కొనసాగినటువంటి గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలియనివారుండరు.

అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే దేవదాస్ అనే చిత్రంతో సాలిడ్ హిట్ అందుకోవడం తో పాటు ఉ ఉ పలువురు అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

అయితే టాలీవుడ్లో కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్ పై ఉన్నటువంటి మక్కువతో అవకాశాల కోసం తన మకాం ని అక్కడికి మార్చింది.అయితే అక్కడికి వెళ్లిన ఈ సమయంలో అవకాశాలు బాగానే దక్కించుకున్నప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.అయితే తాజాగా ఇలియానా గురించి ఓ వార్త నెట్ లో వైరల్ అవుతుంది.

ఈ అమ్మడు రాబోయే కాలంలో యాంకర్ గా అవతారమెత్తనున్నట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేగాక ఇప్పటికే ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇలియానా ని కలిసి వివరాలను వినిపించినట్లు సమాచారం.

Advertisement

అయితే ఇలియానా కూడా ఈ ఆఫర్ పట్ల ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.అంతేగాక పారితోషికం విషయంలో కూడా స్పోర్ట్స్ ఛానల్ బాగానే ఆఫర్ చేసిందట.

అయితే సినిమాల్లో ఎలాగో రాణించలేక పోతుండడంతో యాంకర్ గా మంచి అవకాశం మరియు పారితోషికం కూడా బాగుండడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఇలియానా టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే గతంలో కూడా రవితేజ మరియు ఇలియానా జంటగా నటించినటువంటి అమర్ అక్బర్ ఆంటోనీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది.అందువల్లే రవితేజ ఈ అమ్మడికి మరో ఛాన్స్ ఇచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు