మణిరత్నం సినిమాను దించేస్తున్న టక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని తొలిసారి విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Nani Tuck Jagadish Inspired By Mani Ratnam Movie-TeluguStop.com

ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్నాడు.కాగా ఈ సినిమా తరువాత మరోసారి ‘నిన్ను కోరి’ వంటి సూపర్ హిట్ అందించిన శివనిర్వాణ దర్శకత్వంలో నాని సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

ఈ సినిమాకు టక్ జగదీష్ అనే టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.అయితే ఈ సినిమా కథ సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అగ్ని నచ్చత్రం(తెలుగులో ఘర్షణ) అనే సినిమా కథను పోలీ ఉంటుందని చిత్ర వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి ఆస్తికి తామే వారసులమంటూ వచ్చి ఎలా పోటీపడతారనేది కథగా మణిరత్నం మనకు గతంలోనే చూపించాడు.

ఇక శివ నిర్వాణ ఈ కథకు కాస్త మార్పులుచేర్పులు చేసి తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథను మనకు చూపించేందుకు రెడీ అవుతున్నాడట.

మరి టక్ జగదీష్‌కు సోదరుడిగా ఎవరు నటిస్తారా అనే అంశంపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ క్లారిటీ వచ్చింది.ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి.

మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube