ఖబర్దార్ కాంగ్రెస్ గుండాల్లారా...!

నల్లగొండ జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న దుబ్బాక నియోజకవర్గం లో మెదక్ ఎంపీ మరియు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా మంగళవారం నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో ఐదవ వార్డు కౌన్సిలర్ హీరేఖర్ రమేష్ జీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ గుండాలను ఎన్నికల్లో వాడుకుంటూ ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తుందన్నారు.

ఇలాంటి గుండాలను,కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు మరియు కెసిఆర్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుటకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు నిమ్మల ఇందిరా గౌడ్, ఆదాసు నాగరాణి,విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి నాయక్, నకిరేకంటి సైదులు,చాంద్ పాషా,పిట్ట సైదులు, వీరయ్య,కోడా కోదండ, శ్యామ్,రమణ,రిటైర్డ్ డిపిఓ రామ్మోహన్ రాజు, లక్ష్మణ్ నాయక్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Nandikonda Municipality Brs Leaders Fires On Congress Party, Nandikonda Municipa
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Latest Nalgonda News