నందమూరి ఫ్యామిలీలో ఆ మరణాలకు కారణం శాపమేనా.. చైతన్య కృష్ణ రియాక్షన్ ఇదే!

నందమూరి హీరోలకు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు.నందమూరి హీరోల సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం.

 Nandamuri Chaitanya Krishna Comments On Nandamuri Family Members Death Details,-TeluguStop.com

అయితే గత కొన్నేళ్లలో నందమూరి ఫ్యామిలీలో ఆకస్మిక మరణాలు చోటు చేసుకున్నాయి.హరికృష్ణ,( Harikrishna ) జానకిరామ్,( Janakiram ) తారకరత్న( Tarakaratna ) మరణం నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులను సైతం ఎంతగానో బాధ పెట్టింది.

జానకిరామ్, హరికృష్ణ యాక్సిడెంట్ లో మృతి చెందగా తారకరత్న గుండె సంబంధిత సమస్యల వల్ల మృతి చెందారు.అయితే నందమూరి ఫ్యామిలీలో మరణాలకు కారణం ఏదైనా శాపమా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

అయితే చైతన్యకృష్ణకు కూడా ఇదే ప్రశ్న ఎదురు కాగా చైతన్యకృష్ణ మాట్లడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telugu Breathe, Hari Krishna, Nandamuri-Movie

ప్రపంచంలో ఎన్నో ట్రాజెడీలు జరుగుతున్నాయని మా కుటుంబంలో అలా జరగకూడదని లేదని చైతన్యకృష్ణ( Chaitanya Krishna ) అన్నారు.తారకరత్న మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆమె తెలిపారు.తారకరత్న గర్వం లేని వ్యక్తి అని తాత పేరును ఎప్పుడూ పాడ్ చేయలేదని చైతన్యకృష్ణ పేర్కొన్నారు.

జానకిరామ్ సింపుల్ గా ఉండేవారని అతనికి ఎలాంటి గర్వం లేదని చైతన్యకృష్ణ కామెంట్లు చేశారు.లైఫ్ అంటే ఇలాంటివి ఫేస్ చేయాల్సిందేనని చైతన్యకృష్ణ అన్నారు.

Telugu Breathe, Hari Krishna, Nandamuri-Movie

చైతన్యకృష్ణ నటించిన బ్రీత్ మూవీ( Breathe Movie ) నేడు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కలేదు.యానిమల్ సినిమాతో పోటీ వల్ల బ్రీత్ మూవీ తీవ్రస్థాయిలో నష్టపోయింది.ఈ సినిమాకు నష్టాలు తప్పేలా లేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చైతన్య కృష్ణ రాబోయే రోజుల్లో నటించే సినిమాల ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నందమూరి చైతన్య కృష్ణకు కోరుకున్న సక్సెస్ దక్కే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube