స్టార్‌ హీరో సినిమా మరీ ఇంత స్పీడ్ గా సాధ్యమేనా?

ఈ మధ్య కాలంలో సినిమా ల మేకింగ్ కు చాలా సమయం పడుతుంది.చిన్న హీరోల సినిమాలు అయినా కూడా కనీసం ఆరు నెలల సమయం పడుతున్న విషయం తెల్సిందే.

 Nagarjuna Naasamiranga Movie Interesting Update , Nagarjuna, Naa Saami Ranga , T-TeluguStop.com

ఇక స్టార్‌ హీరోల సినిమాలకు ఏడాది సమయం ఈజీగా తీసుకుంటున్నారు.రాజమౌళి దర్శకులు ఏకంగా రెండు ముడూ సంవత్సరాలు తీసుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో ఒక స్టార్‌ హీరో సినిమాను నాలుగు నుండి అయిదు నెలల్లో పూర్తి చేయడం మాత్రమే కాకుండా విడుదల చేస్తాం అంటూ ప్రకటిస్తే ఎవరైనా నమ్ముతారా.నమ్మాల్సిందే.

నాగార్జున హీరోగా( Nagarjuna )రూపొందుతున్న నా సామిరంగ సినిమా( Naa Saami Ranga ) మొన్ననే షూటింగ్ ప్రారంభం అయింది.

Telugu Big Boss, Naa Samiranga, Nagarjuna, Rajamouli, Sankranti, Telugu, Tollywo

సంక్రాంతికి ( Sankranti )సినిమా రాబోతుంది.ఇప్పటికే సినిమా విడుదలకు సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చేసింది.అంతే కాకుండా సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు నవంబర్ లోనే ముగించబోతున్నారు.

అంటే మూడు నెలల లోపు లోనే సినిమాను ముగిస్తున్నారు. ఒక స్టార్‌ హీరో సినిమా షూటింగ్ ను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయడం ఎంత వరకు సాధ్యం అంటే… నాకు సాధ్యమే అన్నట్లుగా నా సామిరంగ దర్శకుడు అంటున్నాడు.

Telugu Big Boss, Naa Samiranga, Nagarjuna, Rajamouli, Sankranti, Telugu, Tollywo

ఆయన నాగార్జున తో చేస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.ఇంత స్పీడ్ గా నాగార్జున సినిమాను చేయవచ్చా అన్నట్లుగా ఆశ్చర్యపోతున్నాడట.1980 మరియు 90 ల్లో నాగార్జున రెండు మూడు నెలల్లో సినిమాలను పూర్తి చేసిన దాఖలాలు ఉన్నాయి.అప్పట్లో ఏడాదికి అరడజను సినిమాలు వచ్చేవి.

అయినా కూడా మేకింగ్‌ విషయం లో కన్ఫ్యూజన్‌ ఉండేది కాదు.కానీ ఇప్పుడు ఒక సినిమా ను ఏడాది చేసినా కూడా బాబోయ్ అన్నట్లుగా హడావుడి, గందరగోళం కనిపిస్తోంది.

భారీ ఎత్తున స్టార్‌ హీరోల సినిమా లకు ఖర్చు చేస్తున్న కారణంగా నిర్మాతల శ్రేయస్సు నిమిత్తం మెల్లగా చేస్తున్నాం అంటూ దర్శకులు చెబుతున్నారు.కానీ నా సామిరంగ సినిమా మాత్రం స్పీడ్ గా రూపొందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube