ఆమీర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా లాల్ సింగ్ చడ్డా.ఈ సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు.
తెలుగులో ఈ మూవీని మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేస్తుండటం విశేషం.ఈ సినిమాలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా నటించారు.
నాగ చైతన్య ఉండటం వల్ల ఈ సినిమాని తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు.అయితే చైతు ఉన్నా సరే రేపు రిలీజ్ అవుతున్న లాల్ సింగ్ చడ్డా సినిమాకు పెద్దగా బుకింగ్స్ కనిపించట్లేదు.
దీనికి కారణం నాగ చైతన్య రీసెంట్ మూవీ థ్యాంక్యూ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.ఆ సినిమా ఎఫెక్ట్ లాల్ సింగ్ చడ్డా మీద కూడా పడేట్టు ఉంది.
స్వతహాగా ఆమీర్ ఖాన్ కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నా లాల్ సింగ్ చడ్డా సినిమా మీద నాగ చైతన్య సినిమాల ఎఫెక్ట్ బాగా పడినట్టు కనబడుతుంది.అందుకే లాల్ సింగ్ చడ్డా సినిమాకు పేలవమైన బుకింగ్స్ వస్తున్నాయి.
ఇదే కొనసాగితే మొదటిరోజు కొద్ది మొత్తం వసూళ్లనే తెచ్చే అవకాశం ఉంటుంది. అయితే బింబిసార, సీతారామం సినిమాల హిట్ తో బాక్సాఫీస్ జోష్ కనబడుతుంది.
మరి లాల్ సింగ్ చడ్డాకి కూడా అదే రేంజ్ ఊపు ఉంటుందా లేదా అన్నది చూడాలి.