టాలీవుడ్ హీరోలపై కామెంట్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ..!

టాలీవుడ్ సినీ నటి గ్లామర్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గురించి అందరికి తెలిసిందే.తన అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.మోడల్ రంగం నుండి సినీ పరిశ్రమకు పరిచయమైన నభా కన్నడ సినిమాల్లో కూడా నటించింది.

 Nabha Natesh Expressed Her Feelings About Tollywood Heroes And Fans , Nabha Nat-TeluguStop.com

2015 కన్నడ సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన నభా నటేష్ 2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.ఆ తర్వాత హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా లో నటించి అందులో చాందిని పాత్రలో బాగా ఆకట్టుకుంది.ఇటీవలే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో కూడా నటించింది.

అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపును అందుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తెగ బిజీగా ఉంటుంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలపై కొన్ని కామెంట్లు చేయగా వైరల్ గా మారాయి.

Telugu Ram, Ismart, Ismart Shankar, Nabha Natesh, Pawan Kalyan, Raviteja, Tollyw

తాజాగా నభానటేష్ తెలుగు అభిమానుల గురించి, కొందరి హీరోల గురించి కొన్ని విషయాలు తెలిపింది.తనను కొన్ని ప్రశ్నలు ప్రశ్నించగా హీరో రామ్ గురించి ఎనర్జీ బ్లాస్ట్ అంటూ ఒక్కమాటలో చెప్పింది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభిమానుల సునామి అంటూ తన అభిప్రాయం తెలిపింది.

బెల్లంకొండ శ్రీనివాస్ తో నటించడం చాలా బాగుందని తెలిపింది.హీరో రవితేజ గురించి మాస్ కా బాప్, అలాగే మంచి మనసున్న గొప్ప వ్యక్తి అని.తెలుగు అభిమానులు ఉత్తమమైన వాళ్లు అంటూ, తమపై ఆమెకు అపరితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం అంధాధున్ రీమేక్ లో నభా నటేష్ నటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube