కేసీఆర్ కాళ్ళ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్లా మాట్లాడేది

నల్లగొండ జిల్లా: పదవుల కోసం కేసీఆర్ కాళ్ళ దగ్గర తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళా తమ గురించి మాట్లాడేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూర్యాపేట ఎమ్మేల్యే జగదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ పదవుల కోసం కోట్లాడే వాళ్లం కాదన్నారు.

బీఆర్‌ఎస్ వాళ్ళు కండువాలు జేబుల్లో పెట్టుకుని తిరుగుతున్నారన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని కాదు తనను చూసి ఓటేశారని చెప్పారు.

Munugodu MLA Komatireddy Rajagopal Reddy Fired On Suryapet MLA Jagdish Reddy, Mu

భువనగిరి పార్లమెంట్‌లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లేవన్నారు.రేవంత్ రెడ్డి చాలా తెలివిగా వ్యహరించారని,శిష్యుడికి టిక్కెట్ ఇచ్చి నాకు ఇన్‌చార్జ్ ఇచ్చిండన్నారు.

కేసీఆర్‌కు మొగుడు అంటే రేవంత్ రెడ్డి అని నేను ఒప్పుకుంటున్నా అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.ఏడు నియోజకవర్గాల్లో ఎక్కువ మెజార్టీ కోసం ఇదే నా ఛాలెంజ్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ వచ్చిన నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు పక్కా అని స్పష్టం చేశారు.

Advertisement
తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

Latest Nalgonda News