మోడీ.. అక్కడి నుంచే బరిలోకి ?

మన దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ( Narendra Modi Prime Minister of the country ) గత 9 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్నారు.2014 మరియు 2019 ఎన్నికల్లో కేవలం మోడీ మేనియాతోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక వచ్చే ఎన్నికల్లో కూడా మోడీ బొమ్మతోనే ఎన్నికల్లో గెలవాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.అయితే గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక గాలి విస్తోంది.కేంద్రం అనుసరిస్తున్న ఆయా విధానాలు, ప్రతిపక్షాలపై కక్ష పూరితంగా వ్యవహరించడం, నియంత పాలన కొనసాగిస్తుండడం వంటి కారణాలతో మోడీ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోందనేది ప్రస్తుతం వినిప్శితున్న మాట.అందువల్ల గతంతో పోల్చితే ఈసారి మోడీ మంత్రం ఎన్నికల్లో వర్కౌట్ కాదని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.

 Which Seat Is Modi Contesting Details, Parliament Elections,narendra Modi Prime-TeluguStop.com
Telugu Gujarat, Karnataka, Modi, Modicontest, Narendra Modi, Narendramodi, Tamil

దీనికి ఉదాహరణ ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలనే( Karnataka Elections ) చెప్పవచ్చు.డబుల్ ఇంజన్ సర్కార్ అని, మోడీ బొమ్మతో ఎంత హైలెట్ చేసిన బీజేపీకి ఓటమి తప్పలేదు.దీన్ని బట్టి చూస్తే మోడీ మేనియా మెల్లగా మసకబారుతోందా అనే డౌట్ రాక మానదు.ఈ నేపథ్యంలో మోడీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament elections ) పోటీ చేసే స్థానంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

సాధారణంగా మోడీకి గుజరాత్ అడ్డాగా చెప్పుకోవచ్చు.ఈసారి అందుకు బిన్నంగా తమిళనాడు నుంచి మోడీ బరిలోకి దిగే ఆలోచనలో ఉన్నారట.ప్రస్తుతం ఇదే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.ఇప్పటికే తమిళ్ నాడులో పర్యటించిన అమిత్ షా చెన్నైలో రెండు రోజులు ఇదే అంశంపై పార్టీ నేతలతో చర్చలు జరిపారట.

Telugu Gujarat, Karnataka, Modi, Modicontest, Narendra Modi, Narendramodi, Tamil

అయితే మోడీ తమిళనాడులో పార్లమెంట్ సీట్ కోసం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే దానిపై ఎలాంటి క్లారిటీ లేనప్పటికి.దీని వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం.తమిళ్ నాడులో పట్టు కోసం బీజేపీ ఎప్పటి నుంకో ప్రయత్నిస్తోంది.కానీ ప్రంతియాభిమానం కలిగిన తమిళులు.బీజేపీని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో డైరెక్ట్ గా మోడీనే రంగంలోకి దిగితే.

ఇక్కడ బీజేపీ పాటుకుపోవడం పక్కా అనే ఆలోచనలో కాషాయ పెద్దలు ఉన్నారట.అందుకే మోడీ తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు కాషాయ పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీత రామన్ మదురై నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.అలాగే కోయంబత్తూర్ నుంచి మరో బీజేపీ నేత వానతి శ్రీనివాసన్ బరిలోకి దిగుతున్నారు.

ఇప్పుడు మోడీ కూడా తమిళనాడు పై దృష్టి పెడితే.సౌత్ రాజకీయాలు రసవత్తరంగా మారే అవకాశం ఉంది.

మరి ఇది నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube