మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా ఎమ్మెల్యే అడుగులు

నల్లగొండ జిల్లా:మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపుల మోసివేతపై కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి( MLA Raj Gopal Reddy ).

ప్రతి గ్రామానికి గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు దిశా నిర్దేశం చేస్తున్నారు గ్రామ అభివృద్ధి కమిటీల పనితీరును పరిశీలించడానికి త్వరలోనే నియోజకవర్గ గ్రామస్తులతో కలిసి పది బస్సుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో స్టడీ టూర్ కు ప్లాన్ చేశారని సమాచారం.

మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను మూసివేయాలని ప్రజలకు సూచించారు.

MLA's Steps Towards Making Munugodu An Ideal Constituency , Munugodu , Ideal Con

తాను ప్రచారం చేస్తున్న సందర్భంగా గ్రామాలలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాపుల వల్ల సంసారాలు ఆగమయితున్నాయని మహిళలు తమ దృష్టికి తీసుకొచ్చారని ఎన్నికల ప్రచారంలో బెల్ట్ షాపులు మూసేస్తామని హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా బెల్ట్ షాపులో మూసివేతకు కార్యాచరణ ప్రకటించారు.బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉటానని,తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యపానానికి వ్యతిరేకతం కాదు.కానీ, బెల్ట్ షాపులు ఎక్కడబడితే అక్కడ దొరకడం వల్ల యువత చెడిపోతుందన్నారు.

Advertisement

చట్ట ప్రకారం బెల్ట్ షాపులు అమ్మడానికి వీలులేదని గ్రామాలలో నాయకులు అందరూ ఏకమై బెల్టు షాపు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.బెల్ట్ షాపుల్ని బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని ఈ అంశం రాజకీయాలతో సంబంధం లేదన్నారు.

నా పదవి పోయినా పర్వాలేదు బెల్ట్ షాపులు మాత్రం మోసివేయాల్సిందేనని ఈ విషయంలో రాజీ పడేదిలేదని మరోసారి స్పష్టం చేశారు.రాబోయే తరాలకు ఈ విచ్చలవిడి తాగుడు వల్ల మనం ఏం సందేశం ఇస్తున్నామని ప్రశ్నించారు.

బెల్ట్ షాపులు మూసి వేయడం అనేది గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతని గుర్తు చేశారు.బెల్ట్ షాపులు మూసివేసే ప్రయత్నంలో నాతోపాటు నడిచిన వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తానని,నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకోసం కాదు సమాజం కోసం ప్రజల కోసమన్నారు.2014 ముందు గ్రామాలలో బెల్ట్ షాపులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు వచ్చి ఎంతోమంది యువకులు చనిపోయారని,వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరి మీద ఉందని గుర్తు చేశారు.ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఆశామాషిగా తీసుకోవద్దు.

బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలని పిలుపునిచ్చారు.ఒక ఉద్యమం లాగా ఇది రావాలని,బెల్ట్ షాపులు మూసివేయాలని ప్రతి గ్రామంలో దండోరా వేయించండని కార్యకర్తలకు సూచించారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
పేదలకు సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : ఎమ్మెల్యే వేముల

ప్రతి గ్రామంలో పదిమందితో ఒక కమిటీ వేయాలని,ఈ పదిమందిలో నలుగురు మహిళలు ఉండేలా చూసుకోవాలని,ఊరి పొలిమేర లోపల గంజాయి గాని తాగుడు గాని లేకుండా చేయడం ఈ కమిటీ యొక్క విధి అని సూచించారు.ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Advertisement

గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి గ్రామంలో ఒక విలేజ్ డెవలప్మెంట్ కంపెనీ ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు.ఈ అభివృద్ధి కమిటీ ద్వారానే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని దానికి సంబంధించిన నిధుల సమకూర్చడం విషయాలు కూడా చర్చించాలని పేర్కొన్నారు.

విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పనితీరుని పరిశీలించడానికి ఆర్మూరు నియోజకవర్గానికి త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా పది బస్సులలో వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు నేను కూడా వచ్చి పరిశీలిద్దామని నియోజకవర్గ ప్రజలకు తెలిపారు.

Latest Nalgonda News