అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి

నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం కోయిగురోనిబావి గ్రామంలో ఆదివారం జరిగిన అగ్నప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలను సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి పరామర్శించారు.

ఈ సదర్భంగా ప్రమాద బాధితులకు ఆర్ధిక సాయం అందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తగు సాయం అందే విధంగా చూస్తానని,పూర్తిగా ఇండ్లు కాలిపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ మొదటి విడతలో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రమాద తీవ్రతను,అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జి.కిరణ్ కుమార్,డిటి పరీరుద్దిన్, ఆర్ఐ మురళి కృష, జూనియర్ అసిస్టెంట్ కిషన్,గ్రామ కార్యదర్శి క్రాంతి కుమార్,జడ్పీటిసి గాలి రవికుమార్,మాజీ ఎంపిపి చనమళ్ల జగదీష్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ సూదిని జగదీష్ రెడ్డి, కంచర్ల విజయేందర్ రెడ్డి, చందర్ రావు,వెళ్ళ కృష్ణయ్య,శ్రీకాంత్ రావు, యూత్ అధ్యక్షుడు కమతం జగదీష్ రెడ్డి,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడి వెంకన్న,ఓబీసీ సెల్ అధ్యక్షుడు కొత్త నాగరాజు తదతరులు పాల్గొన్నారు.

నల్లగొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై నెగ్గిన అవిశ్వాస...!

Latest Nalgonda News