ఎమ్మెల్యే అమ్మనబోలు మండల గెజిట్ తేవాలి

నల్లగొండ జిల్లా:నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 14 గ్రామ పంచాయతీలతో కూడిన నూతన అమ్మనబోలు మండల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వ గెజిట్ (రాజపత్రం) ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో మాట్లాడి తీసుకురావాలని,లేనిచో మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం నిర్వహించే చండూరు సభను రాజకీయాలకు అతీతంగా అడ్డుకుంటామని" ప్రజా పోరాట సమితి (పీఆర్ పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.

శనివారం 49 రోజులుగా జరుగుతున్న అమ్మనబోలు మండల సాధన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడాతూ పరిపాలనా సౌలభ్యం కోసం నూతన మండలాలను ఏర్పాటు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేవలం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉండే మండలాలను మాత్రమే ఏర్పాటు చేస్తుందని,అన్ని అర్హతలున్నా మిగతా గ్రామీణ ప్రాంతాలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు.

గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధికి నోచుకువలంటే గ్రామీణ మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అమ్మనబోలు మండల కేంద్రంగా 14 గ్రామ పంచాయతీలతో నూతన మండలం ఏర్పాటు చేయాలని గత 49 రోజులుగా మండల సాధన సమితి ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు.

MLA Ammanabolu Mandal Gazette Tevali-ఎమ్మెల్యే అమ్మన

ఇప్పటికైనా ఎమ్మెల్యే చొరవ తీసుకొని మండల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి గెజిట్ విడుదల చేసేలా కృషి చేయాలని కోరారు.లేనియెడల మండల సాధన సమితి ఆధ్వర్యంలో మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరులో జరిగే ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎం.పి.టీ.సి.కొంపల్లి సైదులు,డాక్టర్ మోసోజు భిక్షమయ్య,చిట్టెడి చంద్రారెడ్డి,కావటి పరశురాములు, రాపోలు వెంకటేశం,ఎన్నమళ్ళ పృథ్వీరాజ్,పోతెపాక విజయ్,ఏనుగుతల యాదయ్య,నల్ల రఘుపతిరెడ్డి, ఖమ్మంపాటి శంకరయ్యగౌడ్,సిరిగిరి వెంకటయ్య,గోలి భాస్కర్,కన్నెబోయిన రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన అమృత

Latest Nalgonda News