యాదాద్రి జిల్లా:వీరనారి,విప్లవ మూర్తి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మతోన్మాద బీజేపీపై ఉద్యమించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ పిలుపునిచ్చారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ 37వ వర్ధంతిని యాదాద్రి భువనగిరి ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం అనురాధ మాట్లాడుతూ నైజాం,రజాకార్లకు,భూస్వాములకు వ్యతిరేకంగా వెట్టి చాకిరి విముక్తి కోసం,దున్నేవాడికే భూమి కావాలని పోరాటం చేసిన వీరవనిత ఐలమ్మ అని గుర్తు చేశారు.
నాటి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి పాత్ర లేనటువంటి బిజెపి చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు.మహోజ్వల పోరాటాన్ని హిందూ ముస్లింల గోడవగా చిత్రీకరిస్తుందని అన్నారు.
బీజేపీ పోరాటాల చరిత్రను తెలుసుకోవాలని హితవు పలికారు.తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు వీరనారి చిట్యాల ఐలమ్మ వర్ధంతితో ప్రారంభమై సెప్టెంబర్ 17 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
వీరనారి ఐలమ్మ స్ఫూర్తితో అందరం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలో ఐద్వా జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి,పట్టణ కమిటీ సభ్యులు సభ్యురాలు వడ్డెబోయిన స్వప్న, రమా కుమారి,సరిత,పద్మాబాయి,రాధిక,లలిత, అనిత,సరోజినీ,శాంత,మంజుల,కమల,భాగ్య,లక్ష్మి, సరిత,మంగమ్మ,శ్యామల తదితరులు పాల్గొన్నారు.