బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి( Minister Komati Reddy Venkat Reddy ) కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో ( Congress party )ఏక్ నాథ్ షిండేలు లేరని చెప్పారు.
తెలంగాణలో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ గురించి మట్లాడటం కాదు.ముందు బండి సంజయ్, కిషన్ రెడ్డి ( Bandi Sanjay, Kishan Reddy ) వర్గాల గురించి మహేశ్వర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను ఎందుకు దించారో చెప్పాలన్నారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పై విమర్శలు చేసే వారు విజ్ఞతతో మాట్లాడాలని సూచించారు.