శ్రీ రంగనీతులు రివ్యూ అండ్ రేటింగ్!

సుహాస్‌( Suhas ), కార్తీక్‌రత్నం, రుహానీశర్మ, విరాజ్‌ అశ్విన్‌(Viraj Aswin)వంటి తదితరులు ప్రధాన పాత్రలలో ఆంథాలజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం శ్రీరంగనీతులు( Sri Ranga Neethulu ).డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించినటువంటి ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Suhas Sri Ranga Neethulu Movie Review And Rating,sri Ranga Neethulu, Suhas,ruhan-TeluguStop.com

మరి నేడు విడుదలైనటువంటి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అసలు ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.

-Movie Reviews

కథ:

శివ(సుహాస్) హైదరాబాద్( Hyderabad ) లోని ఓ బస్తి కుర్రాడు.సామ్ సంగ్ లో టెక్నిషియన్ గా వర్క్ చేస్తుంటాడు.బస్తీలు తానే గొప్పగా ఉండాలన్న ఉద్దేశంతో శివ ఆ ప్రాంత రాజకీయ నాయకుడితో ఫోటోలు దిగి పెద్ద ఫ్లెక్సీలు వేయిస్తాడు.

తెల్లారేసరికి ఆ ఫ్లెక్సీ ఉండదు.అది బస్తీలో తన ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు చించేశారని తెలుస్తుంది.

మరో కథలో.ఇందు(రుహాణి శర్మ) వరుణ్(విరాజ్ అశ్విన్) ప్రేమికులు.

ఇందుకు తాను ప్రగ్నెంట్ అని అనుమానం వస్తుంది.అదే సమయంలో ఇంట్లో పెళ్లి సంబంధం ఓకే చేస్తారు.

ఇంట్లో తన ప్రేమ( Love ) విషయం చెప్పడానికి భయపడుతుంది.మరో వైపు కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని మందు, సిగరెట్, గంజాయికి అలవాటు పడతాడు.

ఇలా గంజాయి కి అలవాటు పడటంతో తన ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచడం మొదలు పెడతారు.ఇక కార్తీక్ తమ్ముడికి మొక్కలు అంటే ఎంతో ప్రాణం ఉండడంతో తన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలతో కలిసి ఒక సెల్ఫీ దిగుతాడు.

-Movie Reviews

ఇలా సెల్ఫీ దిగిన ఫోటోని సోషల్ మీడియా( Social Media )లో షేర్ చేయడంతో ఆ మొక్కలలో గంజాయి మొక్క ఉందని గ్రహించినటువంటి పోలీసులు తన ఇంటిపై రైడ్ చేస్తారు.పోలీసులు రావడంతో కార్తీక్ తప్పించుకుని పారిపోతాడు.మరి శివ మళ్ళీ ఫ్లెక్సీ వేయించాడా?శివ తన ఫ్లెక్సీ చింపేసిన ఆపోజిట్ గ్యాంగ్ ని ఏం చేసాడు? ఇందు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందా? తన ప్రగ్నెన్సీ కంఫర్మ్ అయిందా లేదా? కార్తీక్ పోలీసులకు దొరికాడా? కార్తీక్ మాములు మనిషిగా మళ్ళీ మారాడా లేదా అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటులు.

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నటువంటి సుహాస్ ఈ సినిమాలో ఒక బస్తీ కుర్రాడి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.  రుహాణి శర్మ ప్రేమ విషయం ఇంట్లో చెప్పాలంటే భయపడే సాధారణ అమ్మాయిలా మెప్పించింది.

లవర్ బాయ్ లా విరాజ్ మరోసారి ఓకే అనిపించాడు.వ్యసనాలకు అలవాటు పడిన వ్యక్తిగా కార్తీక్ రత్నం కూడా మెప్పించాడు.ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

ఈ సినిమా మూడు కథలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా సెట్ అయింది.ఓకే పాయింట్ తో మూడు విభిన్న కథలుగా దర్శకుడు ఈ సినిమాని చాలా బాగా చూపించారు నిర్మాణాత్మక విలువలు కూడా బాగున్నాయి.నిర్మాతలు ఎక్కడా కాంప్రమైస్ కాలేదు.

విశ్లేషణ.

-Movie Reviews

ఆంథాలజీ జానర్ లో ఈ సినిమాలో మూడు కథలు ఉన్నా ఏ కథకి సంబంధం ఉండదు.కానీ తనికెళ్ళ భరణి( Tanikella Bharani ) గుళ్లో జీవిత కథలు చెప్తూ అవి ఇవేనేమో అనే సందేహం కలిగే లా ఉంటుంది.మూడు కథలు ఒకేసారి చూపించినప్పటికీ స్క్రీన్ ప్లే( Screenplay ) ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వకుండా బాగా రాసుకున్నారు.ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో ఎమోషనల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పాలి.మనుషులు ఉన్నదాంట్లో బ్రతకుండా గొప్పలకు పోతారు లైఫ్ లో ధైర్యంగా ఉండాలనే విషయాన్ని చక్కగా చూపించారు.

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం, నటీనటులు , కామెడీ

మైనస్ పాయింట్స్:

కొన్ని సన్నివేశాలు సాగదీసేయడం

బాటమ్ లైన్:

ఆంథాలజీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది ఒక మంచి సినిమా చూసామని భావన కలుగుతుంది.

రేటింగ్: 3/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube