తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గవర్నర్ తమిళిసై కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
రైతులను ఆదుకునేందుకు కేంద్ర బృందాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.గవర్నర్ ఎందుకు రైతులను పట్టించుకోరని పేర్కొన్నారు.
కర్ణాటక ఎన్నికల్లో డబ్బు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు.వంద కోట్లు ఇవ్వాలనుకుంటే తమ రైతులకే ఇచ్చుకుంటామని తెలిపారు.
తెలంగాణ రైతులు మినహా తమకు ఏ రాష్ట్ర రాజకీయాలు ముఖ్యం కాదని వెల్లడించారు.