మైలేజీ రావట్లేదని కంపెనీ మీద కేసు వేసిన మారుతి సుజుకి ఓనర్.. చివరికి?

కారు మైలేజీ విషయంలో మారుతి సుజు( Maruti Suzuki )కి కంపెనీతో న్యాయపోరాటానికి దిగిన ఒక వాహనదారుడు చివరికి కేసు గెలిచాడు.వివరాల్లోకి వెళితే, రాజీవ్ శర్మ( Rajiv Sharma ) అనే వ్యక్తి 2004లో మారుతి సుజుకి జెన్ కారు కొన్నాడు.

 Maruti Suzuki Owner Who Filed A Case Against The Company For Not Getting The Mil-TeluguStop.com

లీటర్ పెట్రోల్‌తో కారు 16 నుంచి 18 కిలోమీటర్లు నడుస్తుందని వార్తాపత్రికలో వచ్చిన ప్రకటన చూశాడు.కానీ అతని కారు ఒక లీటర్ పెట్రోల్‌తో 10.2 కిలోమీటర్లు మాత్రమే నడిచింది.కారు మైలేజీపై పట్ల అతడి అసంతృప్తి బాగా పెరిగిపోయింది.దాంతో దీనిని తయారు చేసిన కంపెనీ నుంచి రూ.4 లక్షలు పరిహారం ఇప్పించాలని కోరాడు.కారును వెనక్కి తీసుకుని తన డబ్బు, వడ్డీ, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌తో పాటు తనకు తిరిగి ఇవ్వాలని స్థానిక వినియోగదారుల కోర్టు (డీసీడీఆర్‌ఎఫ్‌)కి వెళ్లి ఫిర్యాదు చేశాడు.అతనితో ఏకీభవించిన స్థానిక కోర్టు.

లక్ష రూపాయలు చెల్లించాలని మారుతి సుజుకికి చెప్పింది.ఈ నిర్ణయం పట్ల కంపెనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంతేకాదు రాష్ట్రంలోని ఉన్నత వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది.

Telugu Complaint, Rajiv Sharma-Latest News - Telugu

ఉన్నత న్యాయస్థానం కూడా అతనితో ఏకీభవించింది, స్థానిక కోర్టు నిర్ణయానికి మద్దతు ఇచ్చింది.కానీ కంపెనీ అక్కడితో న్యాయ పోరాటాన్ని వదులుకోలేదు.వారు దేశంలోని అత్యున్నత వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు.

అత్యున్నత న్యాయస్థానం కూడా అతనితో ఏకీభవిస్తూ కంపెనీ అప్పీల్‌ను తిరస్కరించింది.ఇదే కేసులో కంపెనీ, శర్మ మూడుసార్లు కోర్టులో పోరాడాల్సి వచ్చింది.

శర్మకు కారు విక్రయించిన కార్ డీలర్ డిడి మోటార్స్ మాత్రం ఏ కోర్టుకు రాలేదు.కోర్టు ( Court )నోటీసులను పట్టించుకోలేదు.

వారు లేకుండానే కేసు సాగింది.మారుతి సుజుకి కంపెనీ 2023, ఆగస్టు 7న వ్రాతపూర్వక వాదనను అందించగా, శర్మ నవంబర్ 2న తన వాదనను వినిపించారు.

Telugu Complaint, Rajiv Sharma-Latest News - Telugu

2004 అక్టోబర్‌లో ఒక లీటర్ పెట్రోల్‌తో కారు 18 కిలోమీటర్లు నడపగలదని మరో ప్రకటన చూశానని శర్మ చెప్పాడు.ఆ యాడ్ రాకముందే అతడు కారు కొన్నాడని కంపెనీ ఆరోపించింది.రోడ్డు, ట్రాఫిక్, వేగం వంటి అనేక అంశాలను బట్టి మైలేజీ మారుతుందని కూడా కంపెనీ వాదనలు వినిపించింది.అయితే మైలేజీలో తేడా చాలా పెద్దది అని, అందుకే శర్మ నష్టపరిహారానికి అర్హుడని న్యాయమూర్తులు తుది తీర్పు ఇచ్చారు ఆ విధంగా శర్మ చేసావ్ గెలిచి లక్ష రూపాయలు పరిహారం అందుకునేందుకు అర్హత సాధించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube