గుంటూరు కారంలో మహేష్ పాత్రపై క్లారిటీ వచ్చేది ఎప్పుడు!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం గుంటూరు కారం.( Gunturu karam movie ) ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

 Mahesh Babu And Trivikram Movie Gunturu Karam Movie Update , Mahesh Babu, Gunt-TeluguStop.com

అయితే ఇప్పటి వరకు షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి అవ్వక పోవడం తో సంక్రాంతికి విడుదల అయ్యేనా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.ఇలాంటి సమయంలో త్రివిక్రమ్‌ ( Trivikram Srinivas )బర్త్‌ డే సందర్భంగా మహేష్ బాబు అభిమానులకు దమ్ మసాలా బిర్యానీ సాంగ్ ను ఇవ్వడం జరిగింది.

ఇప్పటి వరకు విడుదల అయిన పోస్టర్స్ మరియు వీడియోలను చూస్తే మహేష్ బాబు ఈ సినిమా లో ఏం చేస్తాడు.

ఆయన పాత్ర ఏంటి, ఆయన వృత్తి ఏంటి అనే విషయాలను తెలియలేదు.దాంతో దమ్‌ మసాలా పాట తో అయినా ఆ విషయమై క్లారిటీ వస్తుందని అంతా భావించారు.కానీ ఈ పాట లో కూడా మహేష్ బాబు సినిమా లో ఏం చేస్తాడో దర్శకుడు త్రివిక్రమ్‌ క్లారిటీ ఇవ్వలేదు.

దాంతో మహేష్‌ బాబు అభిమానులు ఇంకా కూడా గందరగోళం గానే ఉన్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఆయన పాత్ర ఏంటి అనేది తెలిస్తే కచ్చితంగా సినిమా పై అంచనాలు పెరుగుతాయి.

దర్శకుడు త్రివిక్రమ్‌ ఆ విషయాన్ని మాత్రం రివీల్‌ చేయకుండా ఉంచుతున్నాడు.

లుక్‌ చూస్తూ ఉంటే మహేష్ బాబు గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ లో కూలీ లా కనిపిస్తాడేమో అంటున్నారు.మొత్తానికి మహేష్ బాబు( Mahesh Babu ) ను గతం లో ఎప్పుడూ చూడని మాస్‌ పాత్ర లో ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు.మరి వారి నమ్మకం ను త్రివిక్రమ్‌ ఎంత వరకు నిలుపుతాడు అనేది చూడాలి.

ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా శ్రీ లీల ( Sreeleela )హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube