రుణమాఫీ వివరాలు ఆన్లైన్లో నమోదు కార్యక్రమం:ఏఓ మహమ్మద్ జానీమియా

నల్లగొండ జిల్లా:నకిరేకల్ మండల వ్యాప్తంగా రుణమాఫీ నిర్ధారణ కార్యక్రమం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి మహమ్మద్ జానీమియా తెలిపారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయా తేదీలో గ్రామాలకు అధికారులు వస్తారని,పంట రుణం పొందిన రైతులందరూ ఆధార్ కార్డు మరియు కుటుంబ సభ్యుల నిర్ధారణ ధ్రువీకరణ పత్రంతో సంబంధిత కుటుంబ సభ్యులు అందరూ అందుబాటులో ఉండాలని సూచించారు.

రైతు యొక్క కుటుంబ సభ్యులను నిర్ధారణ చేసి,రైతు భరోసా యాప్ నందు వివరాలను పొందుపరచి,డిక్లరేషన్ కూడా ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు.నకిరేకల్ మండల పరిధిలో 1450 మంది రైతు కుటుంబాల నిర్ధారణ చేయాల్సి ఉందని,రైతులు సహకరించి,వారి యొక్క కుటుంబాల వివరాలను ఆన్లైన్లో రైతు భరోసాయాప్ నందు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Loan Waiver Details Online Registration Program AO Mohammed Janimia , AO Mohamme

ఈ కార్యక్రమంలో ఏఈఓ విక్రమ్,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరికి వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం : సీఐ శ్రీను నాయక్
Advertisement

Latest Nalgonda News